Home » Priyanka Gandhi
రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని పోస్టర్లు వెలిశాయి. రావమ్మా ప్రియాంక.. ఇక్కడి నుంచి పోటీ చేయండని పోస్టర్ల మీద రాసి ఉంది. అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించాలని కూడా పోస్టర్ల మీద ఉంది.
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొననున్నారు.
రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ఉత్తరప్రదేశ్ లో సాగుతోంది. కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతూ రాహుల్ గాంధీ యాత్రలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా శనివారంనాడు పాల్గోనున్నారు. మొరాదాబాద్ లో రాహుల్‌తో ప్రియంక కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
అస్వస్థతతో శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చికిత్స అనంతరం సోమవారంనాడు డిశ్చార్జి అయ్యారు. అతిసారం, పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్‌తో ఈనెల 16న ఆసుపత్రిలో ప్రియాంక చేరారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ సమాచారాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని గత రెండురోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు దాకా ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త సీసీ తంపితో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా(PriyankaGandhi Vadra) పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఇవాళ తొలిసారి ప్రస్తావించింది.
వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాలు చేసే పొలిటికల్ సూపర్‌స్టార్ల జాబితాను విపక్ష ఇండియా కూటమి పరిశీలిస్తోంది. సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఇండియా కూటమి మంగళవారం సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. నితీష్ కుమార్, ప్రియాంక గాంధీ వాద్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల కాన్వాయ్ తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ముగ్గురు అగ్రనేతలకు కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.