Home » Pressmeet
చాలా తక్కువ వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారనున్నాయని, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఆరు నెలలలోపే ఈ అభివృద్ధి ఫలితాలు ప్రజలకు కనిపిస్తాయన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనతో పారిశ్రామిక, వ్యాపార వేత్తలు భయపడి పారి పోయారని.. అలాంటి వారంతా ఇప్పుడు ఏపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వైఎస్సార్‌సీపీ, బ్లూ మీడియా పత్రిక సాక్షి పై మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా తనపై సాక్షిలో కథనం రాశారని, దానిపై నోటీసులు ఇచ్చానని.. ఈ కేసుకు సంబంధించి సోమవారం విశాఖ కోర్టు వచ్చానని తెలిపారు. అయితే విచారణ వాయిదా పడిందని, దీనిపై ఎన్ని సంవత్సరాలైనా న్యాయపోరాటం చేస్తానని, ఎన్నిసార్లు కేసు వాయిదా పడినా.. కోర్టుకు వస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్‌పై తల్లి, చెల్లికే నమ్మకం లేదని.. ఇక నాయకులకేం ఉంటుందని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,400 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్న ప్రధాని మోదీ, ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవడానికి కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమినేతలందరికీ ధన్యవాదాలు చెప్పారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల్పూర్ వద్ద స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేసామని, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కవిత అన్నారు. జక్రాన్ పల్లి వద్ద ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అర్వింద్ మాటలు చెప్పడం కాదని, చేతల్లో చూపించాలన్నారు. పసుపు బోర్డులో అందరికీ అవకాశం ఇవ్వాలని, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రైతుల కోసం పని చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో పాటు, పత్రికా సమావేశం నిర్వహించి నిలదీస్తే గాని ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదని హరీష్‌రావు అన్నారు. కుల గణన దరఖాస్తులతోపాటు, ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం, ఇది తుది జాబితా కాదని, దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చెప్పించడం బీఆర్ఎస్ విజయమని ఆయన అన్నారు.
ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయని, తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని టీజీ వెంకటేష్ సూచించారు. ఏపీ పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో ట్యాక్సులు కడుతున్నారని, అందులో మనకు రావాల్సిన షేర్లు రావడం లేదన్నారు.
జనవరి 26 వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని, రామ్ మందిర్ నిర్మాణం జరిగినప్పుడే వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారని, దేశంలో రెండు భావజాలాలు ఉన్నాయని, అందులో ఒకటి రాజ్యాంగబద్ధమైన భావజాలం తమదని, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుపతిలో టీటీడీ అధికారులు ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లవద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఈవో శ్యామలరావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బైరాగిపట్టెడలో భక్తులను అనుమతించే సమయంలో కొన్ని లోపాలు జరిగాయని అన్నారు.
హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెప్తున్నాను.. మూసిపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసి నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏపీలు పెట్టించుకుని పడుకున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు.ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే తాను చెబుతున్నానని, అలా అని అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు.