Home » Prashant Kishor
ప్రముఖ రాజకీయ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ 'జన్ సురాజ్ అభియాన్' రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు ముహూర్తం నిశ్చయమైంది. అక్టోబర్ 2వ తేదీన పార్టీగా 'జన్ సురాజ్' అవతరించనుంది.
బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం నితీష్ కుమార్ ఏం చేసేందుకు అయినా వెనకాడారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కాళ్లకు నమస్కారం చేసేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఘటన జరిగిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్‌కు అధికారం, వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం.. అందుకోసం ఆయన ఏం చేయాలని కోరినా సరే చేస్తారని మండిపడ్డారు.
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఇద్దరూ ‘పీకే’లు వైసీపీ (YSR Congress) జెండాను పీకి పడేశారు..! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయింది..! ఎంతలా అంటే వైనాట్ 175 నుంచి సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇద్దరు పీకేలను కూటమి పార్టీ శ్రేణులను గుర్తు చేసుకుంటున్నారు...
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో పసిగట్టలేనంతగా వైరల్ అవుతున్నాయి. చివరికి.. ఈ ఫేక్ వార్తల ఛట్రంలో..
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం విజయతీరాలకు చేర్చే అవకాశాలున్నాయని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2019లో బీజేపీ సాధించిన 303 సీట్లకు దగ్గరగా కానీ, దానికి స్వల్పంగా అధిగమించే అవకాశాలు కానీ ఈసారి ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ గ్యాప్‌లోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వర్సెస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా పరిస్థితులు నెలకొన్నాయి.
Andhrapradesh: ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(TMC) అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ(BJP) నంబర్ 1 పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు- 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమిని చవిచూడబోతున్నాడని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదన్నారు. హైదరాబాద్‌లో ఓ పత్రికా కాంక్లేవ్‌లో ఏపీ రాజకీయాలపై ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రజల బాగోగులు చూస్తున్నామని వాళ్ల సొమ్మును ఖర్చు చేయడం తప్పు అని వ్యాఖ్యానించారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు మించి బీజేపీ, జేడీయూ పొత్తు ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2025లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే నితీష్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.