Home » Ponguleti Srinivasa Reddy
Bhu Bharati land survey: దొంగ పాస్ బుక్‌లకు కూడా రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్దితి ఏర్పడిందని, చెరువులు రహదారులు డొంకలు అన్నీ అక్రమణకు గురయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చేప్పామని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు భూ భారతి తెచ్చామని మంత్రి చెప్పారు.
Telangana Formation Day: జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వరంగల్ జిల్లాలో పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేయనున్నారు.
రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి రానుంది. అలాగే, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజల కు వచ్చే సందేహాల నివృత్తికి కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే వాట్సాప్ చాట్‌బాట్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది.
పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లో ఉంటే, వాటిని స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్‌కు దోస్తానా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కవితనే ఈ విషయం స్వయంగా చెబుతున్నారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోని భూభకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.
నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు రోజుల వ్యవధిలో 300 రిజిస్ట్రేషన్లు జరిగాయని, అందుకు బాధ్యులైన అధికారులంతా పూర్తి నివేదికతో మంగళవారం సాయంత్రం తన వద్ద హాజరు కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారని తెలిసింది.
రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
నిషేధిత జాబితాలోని భూములు రిజిస్ర్టేషన్ కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. భూభారతి తరహాలో ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేశామని, నిషేధిత భూముల వివరాలను అందులో పొందుపరుస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూ భారతి-2025 చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా పర్యవేక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని, ఇందుకోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.