Home » Politics
మంత్రి పదవి కోల్పోయిన అనంతరం కొండా సురేఖ, మురళీధర్‌రావు దంపతుల రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మొదలైంది. మంత్రి పదవి పోయినా తాను కాంగ్రె్‌సలోనే ఉంటానని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటించిన సురేఖ.. కొన్ని గంటల్లోనే కేసీఆర్ మంచివారంటూ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆయన సతీమణి గుర్‌ప్రీత్ కౌర్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. సీఎం దంపతులు రేప్ కేసుల్ని సెటిల్ చేసేందుకు మధ్యవర్తుల ద్వారా ఒక రాకెట్ నడుపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది
మేఘాలయలో యూడీపీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. యూడీపీలో అసంతృప్తి పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరో పోరుబాటకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు అధ్యక్షతన నేడు మధ్యాహ్నం కీలక సమావేశం జరగనుంది.
మంత్రి కొండా సురేఖకు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందేనని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని సూచించింది.
టీఎంసీ రెబల్ ఎంపీల అనర్హతపై స్పీకర్ విచారణ జరపకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.
‘‘నేను అమెరికా వెళ్లాలనుకున్న సమయంలోనే ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరిట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పెట్టుబడుల కోసం అమెరికా, కెనడా పర్యటనకు వెళ్లారు. అమెరికా పెట్టుబడులు గుజరాత్‌కు రాకుండా, తెలంగాణకు వెళ్తాయన్న ఉద్దేశంతో నా పర్యటనకు అనుమతి నిరాకరించారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం స్పష్టతనిచ్చారు. సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని తెలిపారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
బోడుప్పల్ రియల్టర్ గొంగిడి హరికృష్ణపై మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ తదితరులపై నమోదైన హత్యాయత్నం కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
మంత్రి కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై ఎవరూ మాట్లాడవద్దంటూ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన స్పష్టం చేశారు.