Home » Politicians
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల ఒకటి. తీరప్రాంతంలోని ఈ వాణిజ్య/వ్యాపార కేంద్రంలో బలహీనవర్గాలు అధికం. కొణిజేటి రోశయ్య, ప్రగడ కోటయ్య, సజ్జా చంద్రమౌళి వంటి
పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Election 2024) కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశామని చెప్పారు. శనివారం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
అలనాటి పల్నాటి పోరు కేంద్రమైన మాచర్లలో ఈ సారి హోరాహోరీ పోరు నెలకొంది. సమవుజ్జీలైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డి నడుమ పోరు ప్రతిష్ఠాత్మకంగా సాగుతోంది.
విజయనగరం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చీపురుపల్లి. ఈ నియోజకవర్గం మంత్రి బొత్స సత్యనారాయణకు పెట్టని కోట. ఈ నియోజకవర్గ పరిధిలో మూడు దశాబ్దాలుగా బొత్స రాజకీయం చేస్తున్నారు. ఆయనకు సొంత సామాజికవర్గం, బంధుత్వాలు కలసి వస్తున్నా
రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప లోక్‌సభ నియోజకవర్గం.. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు అడ్డా. కళలు, కవులు, ఖనిజాభివృద్ధి, మత సామరస్యానికి నిలయం.. తిరుమలేశుని కడప దేవునికడప..
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలిలో టీడీపీ ఘనవిజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నెల్లూరు సిటీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఇదొక కీలక నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ..
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బంధువుల మధ్య సంగ్రామం జరుగుతోంది. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. ఆయనపై ఆయన మేనల్లుడు కూన రవికుమార్ టీడీపీ తరఫున తిరిగి పోటీచేస్తున్నారు.
పోరాటాల గడ్డ పల్నాడు జిల్లా సత్తెనపల్లి. స్వాతంత్య్ర సమరయోధులు, సంస్కరణోద్యమకారులకు పుట్టిల్లు. గాంధేయవాది వావిలాల గోపాలగోపాలకృష్ణయ్య, ఆమంచి నరసింహారావు వంటి ప్రముఖులు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు.
సామాజిక వర్గాల లెక్కల ప్రకారం డోన్‌లో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో 2,27,351 మంది ఓటర్లు ఉండగా.. బీసీలు దాదాపు లక్షా 7 వేల మంది ఉన్నారు.