Home » Police Rides
ధర్మవరం, ఏప్రిల్ 20: ఎటువంటి బిల్లులు లేకుండా డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తి నుంచి రూ.96,910 నగదును స్వాధీనం చేసుకున్నట్టు వనటౌన సీఐ సుబ్రమణ్యం తెలిపారు. పట్టణంలోని ఎర్రగుంట్ల సర్కిల్‌లో శనివారం ఆయన ఎస్‌ఐ శ్రీనివాస్ ,సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నివాసంపై రాష్ట్ర పోలీసులు సోమవారంనాడు దాడులు జరిపారు. కమల్‌నాథ్ ప్రైవేట్ సెక్రటరీ ఆర్కే మిగ్లానిని పోలీస్ టీమ్ ప్రస్తుతం ఇంటరాగేట్ చేస్తోంది. బీజేపీ అభ్యర్థి వివేక్ బంటీ సాహు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమల్‌నాథ్ నివాసంపై పోలీసులు ఈ దాడులు జరిపారు.
హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్బంగా సుల్తాన్ బజార్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాచిగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు.. టీవీఎస్ ఎలక్ట్రికల్ వాహనంపై వెళ్తున్న అనుఫ్ సోనీ అనే వ్యక్తి వద్ద రూ. 25 లక్షల నగదు లభ్యమైంది.
నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. నగరంలోని ఖానాపూరం హవేలీ స్టేషన్ పరిధిలో 4 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకెట్లుగా చేసి గంజాయి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో నిందితులను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు.
ఢిల్లీ పోలీసులు(Delhi police), ఎన్‌సీబీ(NCB)ల సంయుక్త ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా నెట్‌వర్క్(Drugs racket) గుట్టును రట్టు చేశారు. అయితే ఈ దాందాలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ పెద్ద నిర్మాతగా కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు(police) గుర్తించారు.
గాంజా శంకర్ చిత్ర యూనిట్‌కు టీఎస్ న్యాబ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినిమా పేరు నుంచి గంజాయి అనే పదాన్ని తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
రక్షణగా ఉండాల్సిన పోలీసులు.. భక్షకులుగా మారుతున్నారు. ఖాకీ దుస్తులను అడ్డు పెట్టుకుని అక్రమాలకు తెర లేపుతున్నారు. చేతితో లాఠీ పట్టుకుని లా అండ్ ఆర్జర్ ను బ్రేక్ చేస్తున్నారు.
ఆలూ లేదు సూలూ లేదు అల్లుడి పేరు రామలింగం అన్నట్లుగా ఏపీలో ప్రస్తుత పరిస్థితి తయారైంది. కోడి కొనకముందే మసాలాలు నురుతున్నారు. అవును ఏపీలో ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల హాడావిడి కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలతోపాటు పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని రాజేంద్రనగర్ ( Rajendranagar ) లో లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిలో గురువారం తెల్లవారుజామున ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, బహదూర్గుడా గ్రామ శివారులోని లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్‌పై ఐటి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.