• Home » Police case

Police case

Lookout Notice: కాకాణితో సహా మిగిలిన నిందితుల‌ కోసం పోలీసులు గాలింపు

Lookout Notice: కాకాణితో సహా మిగిలిన నిందితుల‌ కోసం పోలీసులు గాలింపు

అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు రూ.250 కోట్లకి పైగా విలువ చేసే క్వార్ట్జ్, పల్సపర్‌ను కాకాణి అండ్ బ్యాచ్‌ ఎగుమతి చేశారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తిస్థాయిలో అరా తీస్తున్నారు. పేలుడు పదార్ధాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Crime News: హయత్‌నగర్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం...

Crime News: హయత్‌నగర్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం...

నగేష్ భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకుంది. భార్య సూసైడ్ చేసుకోవడంతో భర్త నగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న నగేష్‌ను బంధువులు మంగళవారం రాత్రి జామీను మీద బయటికి తీసుకొచ్చారు. అయితే..

Liquor Scam: సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Liquor Scam: సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జగన్‌ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి సిట్‌ మూడోసారి నోటీసు జారీ చేసింది. మద్యం షాపులకు సరఫరా, లంచాల నెట్‌వర్క్‌ నిర్వహణలో కీలకంగా ఉన్నాడని ఆధారాలు లభించాయి. దీంతో బుధవారం విచారణకు రావాలంటూ సెట్ అధికారులు నోటీసు ఇచ్చారు.

Big Shock: వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..

Big Shock: వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..

వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు వంశీని జైలుకు తరలించనున్నారు.

Kakani: ఇంకా పరారీలోనే మాజీ మంత్రి కాకాణి

Kakani: ఇంకా పరారీలోనే మాజీ మంత్రి కాకాణి

అక్రమ మైనింగ్ కేసులో వైసీసీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులకు సహకరిస్తానని.. విచారణకు వస్తానని చెబుతూనే పది రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసుల తీరుపై కూటమి పార్టీల శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kakani: మాజీ మంత్రి కాకాణి హైడ్రామా.. పోలీసులకు సవాళ్లు...

Kakani: మాజీ మంత్రి కాకాణి హైడ్రామా.. పోలీసులకు సవాళ్లు...

అక్రమమైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు రాకుండా హైడ్రామాకు తెరతీశారు. బుధవారం సాయంత్రం నెల్లూరుకు వస్తానని, గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పలువురికి ఫోన్లు చేస్తున్నాడు. కాగా అరెస్ట్ భయంతోనే కాకాణి హైడ్రామాకు తెరతీశారనే చర్చలు జరుగుతున్నాయి.

Crime News: హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..

Crime News: హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విదేశీయురాలిపై గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం జరిపారు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

బెట్టింగ్ భూతం.. ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తోంది. ఎందరినో బలి తీసుకుంటుంది. బెట్టింగ్ యాప్‌లకు బానిసలుగా మారి.. అప్పుల పాలై.. చివరకు వాటిని తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈజీ మనీకి అలవాటు పడి.. బెట్టింగ్ యాప్‌లు చేసే మాయలో చిక్కుకుని సర్వం పోగొట్టుకుని ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు పెరగడంతో తెలంగాణ పోలీసులు బెట్టింగ్‌పై ఉక్కుపాదం మొపారు.

YCP: నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

YCP: నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్ధాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులు వస్తున్నారన్న విషయం ముందుగా తెలుసుకున్న కాకాణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతనికి చెందిన రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. రెండు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

Crime News: రంగారెడ్డి జిల్లా: అత్తాపూర్‌లో విషాదం..

Crime News: రంగారెడ్డి జిల్లా: అత్తాపూర్‌లో విషాదం..

ఏడాది క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకి కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. ఆమె సూసైడ్ చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియవచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏమైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి