Heavy Nails: పెద్ద పెద్ద గోళ్లు పెంచుతున్నారా కేసులు పెడతారు జాగ్రత్త
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:06 PM
గోళ్లు పెద్దవిగా పెంచుతున్నారా.. స్టైల్‌గా ఉందిలే అనుకుంటున్నారా.. జర జాగ్రత్త మీ గోళ్ల కారణంగా ఎవరైనా గాయపడితే చట్ట ప్రకారం మీరు శిక్షార్హులవుతారు. ఎవరైనా వ్యక్తులు తమపై ఇతర వ్యక్తులు తమ గోళ్లతో దాడి చేశారని ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తారు.

చాలామంది తమ చేతి గోళ్లను కొన్ని సందర్భాల్లో పెంచుతూ ఉంటారు. కొందరు చేతిలో ఏదో ఒక గోరు పెద్దదిగా పెంచుతారు. మరికొందరు బద్ధకం కారణంగా చేతి గోళ్లను కట్ ,చేసుకోకుండా పెంచుతుంటారు. చేతి గోళ్లను పెంచుకోవడం అనేది వ్యక్తిగత విషయం. అయినప్పటికీ గోళ్లను పెద్దవిగా పెంచడం వెనుక కుట్రపూరిత ఉద్దేశం ఉన్నా, ఆ గోళ్లతో ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం కేసులు పెడతారు. గోళ్లు పెద్దవిగా పెంచితే ఎలాంటి కేసులు పెడతారు. చట్టం ఏమి చెబుతోంది. భారతీయ న్యాయ సంహిత-2023 ఏం చెబుతుందో తెలుసుకుందాం. వాస్తవానికి గోళ్లు పెద్దవిగా పెంచితే నేరంగా పరిగణించబడదు. దీనికోసం బీఎన్‌ఎస్‌లో నిర్దిష్ట సెక్షన్లు లేవు. అయితే గోళ్లను ఆయుధం ఉపయోగించి ఎవరికైనా గాయం చేసినా, హాని కలిగించినా పోలీసులు కేసు నమోదు చేస్తారు.
సెక్షన్ 351(2)
భారత న్యాయ సంహిత-2023 ప్రకారం గోళ్లతో ఎవరినైనా గాయపరిస్తే 351(2) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదై నేరం రుజువైతే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో నేరం తీవ్రత ఆధారంగా జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
సెక్షన్ 351(3)
గోళ్లతో గాయపరుస్తానంటూ ఎవరినైనా బెదిరించినా, ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశం ఉందని రుజువైతే 351(3) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే 3 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.
సెక్షన్ 324
గోళ్లను ఆయుధంగా ఉపయోగించి తీవ్రమైన గాయాలు చేస్తే బీఎన్‌ఎస్ ప్రకారం సెక్షన్ 324 కింద కేసు నమోదు చేస్తారు. గోళ్లను ఆయుధంగా ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా గాయం చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఈ సెక్షన్ల కింద కేసు నమోదైతే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయి.
సెక్షన్ 326
గోళ్లను ఉపయోగించి ఎవరికైనా తీవ్రమైన గాయాలు కలిగిస్తే ఈసెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
నేరం రుజువైతే
గోళ్లతో దాడి చేసినట్లు ఆధారాలు ఉంటేనే పోలీసులు కేసు నమోదు చేయడానికి అవకాశం ఉటుంది. గోళ్లతో దాడికి పాల్పడినట్లు నిరూపించడం అవసరం. ఎవరైన ఒక వ్యక్తి గోళ్లతో గాయపరిచినట్లు ఫిర్యాదు చేస్తే ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత మాత్రమే పోలీసులు కేసు నమోదు చేస్తారు.
ఇవి కూడా చదవండి
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
Amaravati Development Plan: అమరావతిపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here