Home » PM Modi
ఇటీవల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచామని, దానితోపాటు ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల వల్ల దేశ ప్రజల పొదుపు రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. భిన్న రకరకాల పన్నుల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించి, ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో 240 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 186 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది.
H1-B వీసాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువు అని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మోదీ ప్రభుత్వానిది మెతక వైఖరి అని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్‌ను కాళేశ్వరం కేసు నుంచి తప్పించే అవకాశం ఉందని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
బర్త్ డే గిఫ్ట్‌గా వచ్చిన కదంబ్ మొక్కను స్వయంగా నాటారు ప్రధాని మోదీ. UK రాజు చార్లెస్ III ప్రత్యేక బహుమతిగా ఇచ్చిన ఈ మొక్కను 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో ప్రధాని నాటారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలతో 140 కోట్ల మందికి మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
పంజాబ్ వరదల్లో జరిగిన నష్టంపై కేంద్రం తక్షణమే పారదర్శక, కచ్చితమైన అంచనా చేపట్టాలని, సమగ్ర సహాయ పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజును పురష్కరించుకుని పలు దేశాల అధినేతలు, ప్రధాన మంత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మోదీకి ఫోన్ చేసి మరీ విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే.