Home » PM Modi
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం, ప్రధాని నరేంద్రమోదీ రాకకు చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్న ఆయన, పోర్టు గెస్ట్‌హౌ్‌సలో బస చేశారు. అక్కడే మంత్రులు, జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు.
భోగాపురంలో నిర్మించిన నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవ ఆహ్వానాల్లో అధికారులు కొంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. ముఖ్యులైన వారికి ఆహ్వానపత్రాలు నేరుగా ఇవ్వలేదు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థింసా నృత్యంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 1న విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
గిరిజన సంప్రదాయ నృత్యం థింసా.. బృంద గానంలాంటింది! పది నుంచి పాతికమంది జట్టుకట్టి లయబద్ధంగా నృత్యం చేయడం దీని ప్రత్యేకత! చూపరులను ఎంతోగానో ఆకట్టుకుంటుందీ నృత్యం! అలాంటిది పదులూ వందలూ కాదు.. ఏకంగా పద్నాలుగు వేల మంది ఒకేసారి థింసా నృత్యం చేస్తే..! అద్భుతం కదూ!! ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్న భోగాపురం విమానాశ్రయం ఆవరణలో ఈ అద్భుత ఆవిష్కరణ జరగనుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పులు ఎక్కువగా చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందరూ ప్రధాన మంత్రుల కంటే మోదీ అప్పులు ఎక్కువ చేశారని తెలిపారు.
డక్కిలి మండలం లింగసముద్రం వద్ద జాతీయ రహదారి నెంబర్ 565పై నిర్మించనున్న హైలెవల్ వంతెనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని సంతకంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ నకిలీదేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. వైరల్ పోస్టులను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత, ఆర్థిక వివరాలను షేర్ చేసుకోవద్దని పీఐబీ సూచించింది.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 13 వేలమంది గిరిజనులతో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.