• Home » Phone tapping

Phone tapping

Phone Tapping Case.. తిరుపతన్న బెయిల్ ఫిటిషన్  వాయిదా..

Phone Tapping Case.. తిరుపతన్న బెయిల్ ఫిటిషన్ వాయిదా..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బెయిల్‌ కోసం అదనపు ఎస్పీ తిరుపతన్న సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. దీంతో జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ కోటేశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం కౌంటర్‌ దాఖలుకు రెండు వారాల సమయం ఇస్తూ.. తదుపరి విచారణ డిసెంబర్‌ 18వ తేదీకి వాయిదా వేసింది.

Congress: ‘హరీష్‌రావు నా ఫోన్ ట్యాపింగ్ చేయించారు’

Congress: ‘హరీష్‌రావు నా ఫోన్ ట్యాపింగ్ చేయించారు’

కాంగ్రెస్ నేత, చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసిపి ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు.

Jaipal Yadav: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు..  మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ విచారణ

Jaipal Yadav: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ విచారణ

సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ శనివారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌ ఏసీపీ నేతృత్వంలోని బృందం ఆయనను విచారించింది.

Phone Tapping: పోలీసుల విచారణకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే

Phone Tapping: పోలీసుల విచారణకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే

Telangana: ‘‘నాకు ఓ కుటుంబ వివాదం పరిష్కారం కోసం అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను కలిశాను. తిరుపతన్న మా సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో కుటుంబ వివాదాన్ని ఇద్దరం పరిష్కరించాము. నేను ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లు తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు వివరణ కోరారు’’ జైపాల్ యాదవ్ తెలిపారు.

Phone Tapping Case: ఆ 2 ఫోన్‌ నంబర్లు ఎందుకు పంపారు?

Phone Tapping Case: ఆ 2 ఫోన్‌ నంబర్లు ఎందుకు పంపారు?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసులు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడ్ని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీస్‌ అధికారుల్ని అరెస్ట్‌ చేయగా, పెద్ద సంఖ్యలో సాక్షుల్ని విచారించారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును ఇప్పటికే పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ప్రణీత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్‌లో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుళ్లను పిలిచి విచారిస్తున్నారు. SIBలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు.

Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. చిరుమర్తి లింగయ్య కీలక విషయాలు వెల్లడి..

Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. చిరుమర్తి లింగయ్య కీలక విషయాలు వెల్లడి..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలైన బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డిలను విచారించే అవకాశం ఉంది.

Phone Tapping Case.. రెండు నంబర్లు ట్యాప్ చేయించిన లింగయ్య..

Phone Tapping Case.. రెండు నంబర్లు ట్యాప్ చేయించిన లింగయ్య..

ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా రాజాకీయ నేతలను పోలీసులు విచారించనున్నారు. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డిలను విచారణ చేసే అవకాశముంది.

Phone Tapping: సెల్‌ఫోన్లలోని ‘గుట్టు’ రట్టు!

Phone Tapping: సెల్‌ఫోన్లలోని ‘గుట్టు’ రట్టు!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల సెల్‌ఫోన్లలో చెరిపేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్‌) నిపుణులు తిరిగి (రిట్రీవ్‌) రాబట్టారు.

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. ఉమ్మండి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల చుట్టూ ఈ వ్యవహారం నడుస్తోంది. తాజాగా ఈ కేసులో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి