Home » Pawan Kalyan
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసైనికులు ముందు ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వంద మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుందని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత మాట్లాడుతూ గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను ఆ అంజన్నే కాపాడారని కామెంట్ చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లి నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కొండ గట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి రేపు (శనివారం) ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసింది. టీటీడీ నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలు చేయనున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో సికిల్ సెల్ ఎనేమియా బాధితుల కోసం అతి త్వరలో అరకులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కానుంది. దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణం జరగనుంది.
చంద్రబాబు సారథ్యంలో కొలువు తీరిన కూటమి ప్రభుతానికి ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తితే.. ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటుకు క్యూ కట్టాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటం గ్రామంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను కలిశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేసులో ఇవాళ విచారణ జరిగింది. పవన్ విన్నపానికి ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.