Home » Pawan Kalyan
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన NDA ముఖ్యమంత్రులు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. స్థానిక అశోకా హోటల్‌లో మధ్యాహ్నం 3 వరకు ఈ సమావేశం జరగనుంది.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారా అని పవన్ పేషీ ప్రశ్నించింది.
మహిళల సాధికారతకు ఏపీ ప్రభుత్వం మరో పథకంతో ముందుకొచ్చింది. ఫలితంగా ఆడవాళ్లకు ఇంటిదగ్గరే సంపాదించుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కుతుంది. డ్వాక్రా సంఘాలలోని మహిళలకు ఈ అవకాశం దక్కబోతోంది.
గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రావివలస గ్రామానికి రూ.15 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేశారు.
రాష్ట్రంలో నియంత్రణ లేకుండా అడవులను నాశనం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మన విజ్ఞానం అహంకారాన్ని ఇచ్చిందని, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం పెంచడం మనందరి బాధ్యత అని.. ఒక పార్టీనో, ఒక వ్యక్తినో మనం నిందించలేమని పేర్కొన్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదల పవన్ కల్యాణ్ 26వతేదీన చెన్నైలో పర్యటించనున్నారు. 26వ తేదీ ఉదయం10 గంటలకు చెన్నైలోని రామచంద్ర కన్వెన్షన్ హాలులో జరిగే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనే అంశంపై జరగనున్న సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి లేఖ రాశారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోని కాళేశ్వర క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం రానున్నారు.
Pawan Kalyan tweet: ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది (సీజ్‌ఫైర్). ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ పాకిస్తాన్ వక్రబుద్ధిపై సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.
మురళీ నాయక్ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు