Home » Parliament
గతేడాది (2024)లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమెంతో తెలుసా.. అక్షరాలా రూ.22,845.73 కోట్లు. ఈ వివరాలు ఇవాళ కేంద్రం వెల్లడించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి, అనంతరం పాకిస్థాన్ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశాలపై ..
అహ్మదాబాద్‌లో గత నెలలో బోయింగ్ డ్రీమ్‌లైనర్ కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని బోయింగ్ 787-8/9 డ్రీమ్‌లైనర్ల తనిఖీలకు డీజీసీఏ ఆదేశించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.
నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా, వద్దా? అనే దానిపై స్పీకర్/సభ చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించేందుకు పహల్గాం ఉగ్రదాడి, బిహార్ ఓటర్ల జాబితా సవరణ సహా 8 అంశాలను విపక్ష పార్టీలు గుర్తించాయి. తమ డిమాండ్లపై విపక్ష పార్టీలు లోక్‌సభలో నినాదాలు చేయడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ, ఆ తర్వాత 2 గంటల వరకూ సభ వాయిదా పడింది.
ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.
నేటి (జూలై 21) నుంచి దేశంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు.
ఈరోజు (జూలై 21) నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ప్రాంగణం నుంచి ప్రసంగించారు. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి.
ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన..
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలలో 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది.