Home » Operation Sindoor
పహల్గాంలో పర్యాటకులను దారుణంగా చంపారని, వివరాలు అడిగి మరీ చంపారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య కళ్లముందే శుభమ్ అనే వ్యక్తిని చంపేశారని అన్నారు. పహల్గాంలో పర్యాటకుల దగ్గర భద్రతా సిబ్బంది ఎందుకు లేరని ప్రశ్నించారు.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేసేందుకు నవీన భారతదేశం ఎంతవరకైనా వెళ్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడితో 26 మందిని పొట్టనబెట్టుకున్న ముష్కరులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో జైశంకర్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు పలుమార్లు అంతరాయం కలిగించారు. దీంతో అమిత్‌షా జోక్యం చేసుకుంటూ.. మీ సొంత విదేశాంగ మంత్రినే మీరు నమ్మరా' అంటూ విపక్షాలపై మండిపడ్డారు.
రాజ్యసభలోనూ ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై 16 గంటల సేపు చర్చ మంగళవారంనాడు జరుగనుంది. రాజ్యసభలోనూ రక్షణ మంత్రి చర్చను ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చర్చలో పాల్గొంటారు.
అమెరికా మధ్యవర్తిత్వంపై వస్తున్న ఊహాగానాలను జైశంకర్ కొట్టివేశారు. ఏప్రిల్ 22 జూన్ 17 మధ్య ప్రధానమంత్రి మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణలు జరగలేదని సభకు వివరించారు.
ఆపరేషన్ సింధూర్ హైలైట్స్‌ను జే పాండా వివరిస్తూ, భారత వాయిసేన పాక్‌లోని 11 వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని, 20 శాతం పాక్ వాయిసేన ఆస్తులను ధ్వంసం చేసిందని చెప్పారు. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో చర్చించేందుకు కాంగ్రెస్‌కు సుమారు రెండు గంటల సమయం కేటాయించారు. ఈ చర్చలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొంటారని తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి జరిగి 100 రోజులైన తర్వాత కూడా ఆ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్ర వైపల్యాన్ని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన ఇన్ని రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు.
పాకిస్థాన్‌లోని పలు వైమానిక కేంద్రాలపై భారత వాయిసేన భీకరంగా విరుచుకుపడటంతో పాకిస్థాన్ ఓటమిని అంగీకరించి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌కు విరామం ఇచ్చేందుకు కేవియట్‌తో ఆమోదించామని తెలిపారు.