Home » Operation Sindoor
విజయనగరానికి చెందిన ఉగ్రవాద సానుభూతి కలిగిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ మరియు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ పై ఎన్‌ఐఏ అధికారులు ఆర్థిక మూలాలు, బ్యాంకు ఖాతాలు, కాల్ డేటా తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్‌కి 10 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు సమాచారం, మరియు ఆయన ఆర్థిక లావాదేవీలను విశ్లేషించేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో ఆయుధాల మోహరింపునకు ఆలయ యాజమాన్యం అనుమతిచ్చినట్టు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ సుమేర్ ఇవాన్ పేర్కొన్నారు. అయితే ఆ వ్యాఖ్యలను భారత సైన్యం అధికారికంగా ఖండించింది.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఉపయోగించిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె పాక్ పర్యటనలు, వాట్సాప్ చాట్ల ఆధారంగా గూఢచర్యం కేసులో విచారణ కొనసాగుతోంది.
పాకిస్థాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై మే 7న జరిపిన మిలటరీ దాడులపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, నిపుణులైన సర్జన్లులా మన బలగాలు సత్తా చాటుకున్నాయని చెప్పారు. ''నిపుణులైన డాక్టర్లు, సర్జన్లు ఎలా వ్యవహరిస్తారో మన బలగాలు కూడా అలాగే పనిచేశాయి. ఉగ్రవాద మూలాలలై ప్రతిభావంతంగా దాడులు జరిపాయి'
Indian Air Force: పాకిస్థాన్ ఎయిర్ బేస్‌లను మన ఎయిర్ ఫోర్స్ దళాలు నాశనం చేశాయి. శత్రువు వెన్నులో వణుకు పుట్టించాయి. పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా సాయంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది.
పెహల్గాంలోని ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఎదురుదాడి చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది. అందుకు ప్రతిగా పాక్ కూడా ఎదురు కాల్పులకు దిగింది. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి పాల్పడింది.
రాహుల్ గాంధీ గత రెండ్రోజులుగా ఆధారాలున్నాయా అంటూ ప్రశ్నించడంపై సంబిత్ పాత్ర మాట్లాడుతూ, మొదటి రోజు నుంచి తాము డిజిటల్ ఆధారాలను ప్రెజెంట్ చేస్తూనే ఉన్నామని చెప్పారు.
జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ ప్రతికారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా ఆపరేషన్ సిందూర్ గురించిన ప్రతి విషయాన్ని డానిష్‌తో చాటింగ్ ద్వారా షేర్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా..
Pawan Kalyan: సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యమని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిందని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ డెలిగేషన్ కోసం ఒక పేరును సూచించాలని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరడంతో అభిషేక్‌ను పార్టీ తరఫున సీఎం నామినేట్ చేశారు.