Home » Ongole
Andhrapradesh: టీడీపీలో చేరేందుకు తమ కుటుంబం సంసిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి రాఘవరెడ్డితో కలిసి టీడీపీలో చేరుతాను. ఏ రోజు టీడీపీలో చేరాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరాను. మాగుంట రాఘవరెడ్డిని ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుకుంటున్నాను’’ అని వెల్లడించారు.
Andhrapradesh: ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. సోమవారం ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలను అల్పాహార విందుకు ఎంపీ ఆహ్వానించారు. ఈ క్రమంలో మాగుంట ఇంట్లో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ ఛార్జ్ రవికుమార్ భేటీ ఆయ్యారు.
YS Jagan Siddham Sabha: కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి కానీ అవన్నీ కల్పితం. గ్రాఫిక్స్ మాయాజాలంతో లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించినవి. అచ్చం వైసీపీ ఇలాగే జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. లేని గొప్పలకు పోయి నవ్వులపాలైంది..
YS Jagan Siddham Sabha: మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలుతానని ప్రకటించుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఈ ముచ్చట ఐదేళ్లకే ముగియనుందని అర్థమైపోయిందా..? పదవి పోతుందని ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారా..? బాపట్ల జిల్లా మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో ఆయన ప్రసంగం జనానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి...
ప్రకాశం: జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయ జన్మనిచ్చిందన్నారు.
AP Elections 2024: కష్టాల్లో ఉన్నప్పుడు రారమ్మని పిలిచారు. అధికారంలోకి రాగానే ఎదురుదాడి ప్రారంభించారు. తొలుత ఆర్థిక వనరులపై దాడి. ఆ తర్వాత ఆయన మాటచెల్లకుండా అధికారులపై ఆంక్షలు. ఇంకోవైపు కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు నిధులు తెస్తే రాష్ట్రా వాటా నిధులివ్వకుండా అడ్డుకోవడం. ఎదురువెళ్లి నమస్కరించినా అగౌరవపరిచి పొమ్మనకుండా పొగబెట్టడం. తాజాగా సోషల్ మీడియాలో పాపమంతా బీజేపీదే అన్న అసత్య ప్రచారాలకు దిగడం.
పేదల సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అలవోకగా పచ్చి అబద్ధాలను చెప్పారు. ఒంగోలులో నివాస స్థల పట్టాల పంపిణీపై హైకోర్టులో వైసీపీ నేత పిల్ వేయగా, చంద్రబాబే కోర్టుకు వెళ్లినట్లుగా జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇంటింటికీ అందించామని సీఎం జగన్ వెల్లడించారు. నేడు ఆయన ఒంగోలు బహిరంగ సభలో మాట్లాడుతూ.. గతంలో అందని నామినేటెడ్ పదవుల్ని చట్టం చేసి 50 శాతం పేదల చేతుల్లో పెట్టామన్నారు. ఎమ్మెల్యేలకు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చే నిబంధనల ప్రకారమే పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఒంగోలులో ఈ రోజు సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం జగన్ ఒంగోలు వస్తున్నారు. జగన్ బహిరంగ సభకి జనసమీకరణ కోసం ప్రైవేటు స్కూల్ బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్, మిగిలిన విద్యార్థులకు ఈరోజు నుంచి ఎఫ్ఏ-4 ఎగ్జామ్స్ జరగనున్నాయి. బస్సులు లేక పోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో విచక్షణా రహితంగా పొడిచిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.