• Home » ODI World Cup

ODI World Cup

ODI World Cup: ఫైనల్‌ మ్యాచ్‌కు వచ్చే అతిరథ మహారథులు వీళ్లే..!!

ODI World Cup: ఫైనల్‌ మ్యాచ్‌కు వచ్చే అతిరథ మహారథులు వీళ్లే..!!

ODI World Cup: ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మెగా ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతున్నారు.

Astrotalk CEO: ఇండియా ప్రపంచకప్ గెలిస్తే.. రూ.100 కోట్లు పంపిణీ

Astrotalk CEO: ఇండియా ప్రపంచకప్ గెలిస్తే.. రూ.100 కోట్లు పంపిణీ

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు కొన్నిగంటల ముందు ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక ఫైనల్ పోరులో భారత్ గెలవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఒకవేళ ఫైనల్లో భారత్ గెలిస్తే తమ కంపెనీ వినియోగదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ODI World Cup 2023: టీమిండియాదే ప్రపంచకప్.. తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు

ODI World Cup 2023: టీమిండియాదే ప్రపంచకప్.. తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు

Astrologer Sumit Bajaj: వన్డే ప్రపంచకప్ తుది సమరానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రెండు అత్యుత్తమ జట్లు ఆదివారం జరిగే ఫైనల్‌లో ఆడబోతున్నాయి. ఇటు భారత్, అటు ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ రెండు జట్లలో ఏ టీమ్ గెలుస్తుందోనని అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. అయితే టీమిండియాదే ప్రపంచకప్ అని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు స్పష్టం చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ODI World Cup Final:  టీమిండియా ఫ్యాన్స్‌ను వెంటాడుతున్న నాలుగు భయాలు

ODI World Cup Final: టీమిండియా ఫ్యాన్స్‌ను వెంటాడుతున్న నాలుగు భయాలు

Team India Fans Tensions: ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. 2003 తర్వాత ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆడటం ఇది రెండోసారి. దీంతో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే అభిమానుల్లో నాలుగు భయాలు మాత్రం వెంటాడుతున్నాయి

World Cup: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ రేసులో 9 మంది ఆటగాళ్లు.. టీమిండియా నుంచే నలుగురు

World Cup: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ రేసులో 9 మంది ఆటగాళ్లు.. టీమిండియా నుంచే నలుగురు

Player of the Tourney: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు సూపర్ ఫామ్‌లో ఉండడంతో ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

World Cup Final: ప్రపంచకప్ ముగింపు వేడుకల్లో భారత వైమానిక దళం ప్రత్యేక ప్రదర్శన

World Cup Final: ప్రపంచకప్ ముగింపు వేడుకల్లో భారత వైమానిక దళం ప్రత్యేక ప్రదర్శన

భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో సమవుజ్జీలైన భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు కావడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐసీసీ ముగింపు వేడుకలను నిర్వహించనుంది.

Ind Vs Aus: ఫైనల్ మ్యాచ్‌కు ఐరన్ లెగ్ అంపైర్.. మరీ టీమిండియా పరిస్థితి ఏంటో.. అభిమానుల కలవరపాటు!

Ind Vs Aus: ఫైనల్ మ్యాచ్‌కు ఐరన్ లెగ్ అంపైర్.. మరీ టీమిండియా పరిస్థితి ఏంటో.. అభిమానుల కలవరపాటు!

Ind Vs Aus Final: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు అంపైర్లను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, రిచర్డ్‌ కెటిల్‌బరో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో (Richard Kettleborough) విషయమే భారతీయ అభిమానులను ఇప్పుడు కలవరపాటుకు గురి చేస్తుంది.

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ జరిగే అహ్మదాబాద్ స్టేడియం గత రికార్డులపై ఓ లుక్కేయండి!

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ జరిగే అహ్మదాబాద్ స్టేడియం గత రికార్డులపై ఓ లుక్కేయండి!

World cup 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభంకానుంది. తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లక్ష 30 వేల మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

World Cup Final: ఆస్ట్రేలియా 450/2, టీమిండియా 65 ఆలౌట్.. ఫైనల్ మ్యాచ్‌పై స్టార్ క్రికెటర్ జోస్యం!

World Cup Final: ఆస్ట్రేలియా 450/2, టీమిండియా 65 ఆలౌట్.. ఫైనల్ మ్యాచ్‌పై స్టార్ క్రికెటర్ జోస్యం!

Mitchell Marsh Prediction: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు టీమిండియా, ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా తలపడనున్నాయి. స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ODI World Cup 2023: ప్రపంచకప్ ఫైనల్.. విమాన టిక్కెట్ ధరలు భారీగా పెంపు

ODI World Cup 2023: ప్రపంచకప్ ఫైనల్.. విమాన టిక్కెట్ ధరలు భారీగా పెంపు

Flight Tickets Rates: వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పలు విమానయాన సంస్థలు అదనపు విమానాలను నడుపుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి