• Home » ODI World Cup

ODI World Cup

SA Vs AFG: సెంచరీ మిస్ చేసుకున్న ఒమర్‌జాయ్.. ఆప్ఘనిస్తాన్ ఫైటింగ్ స్కోరు

SA Vs AFG: సెంచరీ మిస్ చేసుకున్న ఒమర్‌జాయ్.. ఆప్ఘనిస్తాన్ ఫైటింగ్ స్కోరు

ODI World Cup 2023: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 116 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆప్ఘనిస్తాన్‌ను అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఆదుకున్నాడు. 107 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి చివరకు నాటౌట్‌గా మిగిలాడు.

ODI World Cup: పాకిస్థాన్‌కు వసీం అక్రమ్ సూపర్ చిట్కా.. అలా చేస్తే సెమీస్‌కు వెళ్తారని సలహా

ODI World Cup: పాకిస్థాన్‌కు వసీం అక్రమ్ సూపర్ చిట్కా.. అలా చేస్తే సెమీస్‌కు వెళ్తారని సలహా

Pakistan Team: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆటతీరుపై వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి జట్టును తానెప్పుడూ చూడలేదని మండిపడ్డాడు. జట్టు వైఖరి మారాలని.. ఇప్పటికైనా ఆటతీరు మెరుగుపర్చాలని అక్రమ్ సూచించాడు. అయితే పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు వెళ్లాలంటే ఆ జట్టు మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ సూపర్ చిట్కా చెప్పాడు.

ODI World Cup: టీమిండియా తొలి మ్యాచ్ ఎవరితో ఆడిందో ఆఖరి మ్యాచ్ వాళ్లతోనే ఆడుతుంది..!!

ODI World Cup: టీమిండియా తొలి మ్యాచ్ ఎవరితో ఆడిందో ఆఖరి మ్యాచ్ వాళ్లతోనే ఆడుతుంది..!!

Team India: ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా నుంచి మొన్న దక్షిణాఫ్రికా వరకు అన్ని జట్లను ఓడించింది. ఇప్పుడు సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడే అవకాశాలు ఉన్నాయి. మెగా టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ ఎవరితో ఆడిందో ఆఖరి మ్యాచ్ వాళ్లతోనే ఆడుతుందని వాన్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

NZ Vs SL: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘనవిజయం.. పాకిస్థాన్ ఆశలు గల్లంతు

NZ Vs SL: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘనవిజయం.. పాకిస్థాన్ ఆశలు గల్లంతు

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో నాలుగో సెమీస్ బెర్త్ దాదాపు న్యూజిలాండ్ కైవసం చేసుకున్నట్లే భావించాలి. సెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది.

ODI World Cup 2023: ఇదే ఆఖరి అవకాశం.. సెమీస్, ఫైనల్ టిక్కెట్లు కావాలంటే ఇలా చేయండి..!!

ODI World Cup 2023: ఇదే ఆఖరి అవకాశం.. సెమీస్, ఫైనల్ టిక్కెట్లు కావాలంటే ఇలా చేయండి..!!

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. ఈ మేరకు క్రికెట్ అభిమానులకు బీసీసీఐ చివరి అవకాశాన్ని కల్పిస్తోంది. సెమీస్, ఫైనల్ లాంటి నాకౌట్ మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను ఈనెల 9న అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఆయా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియాలలో చూసి టీమిండియాకు మద్దతు తెలపాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.

 NZ Vs SL: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్

NZ Vs SL: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్

ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజృంభించింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించారు. 46.4 ఓవర్లలో 171 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేశారు.

World Cup: పాకిస్థాన్ సెమీస్ చేరితే జరిగేది ఇదేనా..? అప్పుడు టీమిండియా పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?

World Cup: పాకిస్థాన్ సెమీస్ చేరితే జరిగేది ఇదేనా..? అప్పుడు టీమిండియా పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?

India vs Pakistan: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు జట్లన్నీ 8 మ్యాచుల చొప్పున ఆడాయి. అన్ని జట్లకు ఇంకా ఒక్కో మ్యాచ్ చొప్పున మాత్రమే మిగిలి ఉంది. టాప్ 3లో ఉన్న భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు సెమీస్ బెర్త్‌లు కూడా ఖరారు అయిపోయాయి. దీంతో ఇక ఒకే ఒక్క సెమీస్ బెర్త్ మిగిలి ఉంది. ప్రస్తుతం ఈ ఒక్క స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్‌లో తలపడనున్నాయి.

World Cup: మరింత ముదిరిన వివాదం.. మా దేశానికి వస్తే రాళ్లతో కొడతాం.. షకీబ్‌‌కు మాథ్యూస్ బ్రదర్ వార్నింగ్

World Cup: మరింత ముదిరిన వివాదం.. మా దేశానికి వస్తే రాళ్లతో కొడతాం.. షకీబ్‌‌కు మాథ్యూస్ బ్రదర్ వార్నింగ్

Mathews Brother Warns to Shakib: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ టైమ్‌డ్ ఔట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వివాదం మరింతగా ముదిరింది. ఈ వివాదంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతోపాటు రెండు దేశాల అభిమానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. అయితే ఈ వివాదంలో మెజారిటీ మంది మాథ్యూస్‌కు అండగా నిలుస్తున్నారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను తప్పుబడుతున్నారు.

World Cup: పాపం కష్టాలన్నీ న్యూజిలాండ్‌కే.. మ్యాచ్ సమయంలో వర్షం వచ్చే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయంటే..?

World Cup: పాపం కష్టాలన్నీ న్యూజిలాండ్‌కే.. మ్యాచ్ సమయంలో వర్షం వచ్చే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయంటే..?

New zealand vs Sri lanka: ప్రపంచకప్‌లో నేడు కీలక పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. కివీస్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. దీంతో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రస్తుత బలబలాల పరంగా చూసుకుంటే శ్రీలంకను ఓడించడం న్యూజిలాండ్‌కు పెదగా కష్టం కాకపోవచ్చు.

World Cup: టీమిండియాకు షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ స్టార్ ఆటగాడు

World Cup: టీమిండియాకు షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ స్టార్ ఆటగాడు

India vs Netherlands: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా అందరికంటే ముందుగానే సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టు ఒక భారత్ మాత్రమే. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన భారత జట్టు 16 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. ఇక లీగ్‌లో ఆదివారం జరిగే తమ చివరి మ్యాచ్‌కు టీమిండియా సిద్ధం అయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి