• Home » ODI World Cup

ODI World Cup

World Cup: మరో 12 పరుగులు చేస్తే కెప్టెన్‌గా చరిత్ర సృ‌ష్టించనున్న రోహిత్ శర్మ

World Cup: మరో 12 పరుగులు చేస్తే కెప్టెన్‌గా చరిత్ర సృ‌ష్టించనున్న రోహిత్ శర్మ

Rohit Sharma: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి అందరికంటే ముందుగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఇక లీగ్ దశలో భారత జట్టు తన చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో భారత జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

World Cup: పాకిస్థాన్ పరువు తీసిన స్టార్ క్రికెటర్.. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు

World Cup: పాకిస్థాన్ పరువు తీసిన స్టార్ క్రికెటర్.. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు

Haris Rauf: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ వరల్డ్‌కప్‌లో దారుణంగా విఫలమైన హరీస్ రౌఫ్ ఏకంగా 500కుపైగా పరుగులు సమర్పించుకున్నాడు.

ODI World Cup: మెగా టోర్నీని ఓటమితో ముగించిన పాకిస్థాన్..!!

ODI World Cup: మెగా టోర్నీని ఓటమితో ముగించిన పాకిస్థాన్..!!

Pakistan: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. తప్పకుండా భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటతీరు నిరాశపరిచింది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 8 పాయింట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకుంది.

Social Media: అభిమానుల మధ్య చిచ్చు.. ట్రెండింగ్‌లో ‘SHAME ON STAR SPORTS’

Social Media: అభిమానుల మధ్య చిచ్చు.. ట్రెండింగ్‌లో ‘SHAME ON STAR SPORTS’

Fans War in Social Media: వన్డే ప్రపంచకప్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా విజయాలకు సంబంధించి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే స్టార్ స్పోర్ట్స్ క్రెడిట్ ఇవ్వడాన్ని పలువురు తప్పుబడుతున్నారు ఈ అంశానికి సంబంధించి సదరు ఛానల్ విడుదల చేసిన ప్రోమో విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య కామెంట్ల యుద్ధం నడుస్తోంది.

ODI World Cup: అఫీషియల్.. ఫస్ట్ సెమీస్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్

ODI World Cup: అఫీషియల్.. ఫస్ట్ సెమీస్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్

Team India: వన్డే ప్రపంచకప్‌లో నాలుగు సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారయ్యాయి. ఇంగ్లండ్-పాకిస్థాన్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తన లక్ష్యాన్ని నిర్ణీత ఓవర్లలో చేరుకోకపోవడంతో ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు దూరమయ్యాయి. దీంతో అధికారికంగా తొలి సెమీస్ భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతుందని స్పష్టమైంది. రెండో సెమీస్ ఈనెల 16న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతా వేదికగా జరుగుతుంది.

BAN vs AUS: మిచెల్ మార్ష్ ఊచకోత.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం

BAN vs AUS: మిచెల్ మార్ష్ ఊచకోత.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం

Bangladesh vs Australia: ఈ వరల్డ్ కప్-2023 ప్రారంభంలో ఆస్ట్రేలియా వరుసగా రెండు పరాజయాలు చవిచూడటం చూసి.. ఈసారి కంగారులు లీగ్ దశలోనూ ఇంటి బాట పడతారని అంతా అనుకున్నారు. కానీ.. మూడో మ్యాచ్ నుంచి వరుస విజయాలు నమోదు చేస్తూ వస్తున్నారు.

World Cup: చరిత్ర సృష్టించిన వన్డే ప్రపంచకప్.. 48 ఏళ్లలో తొలిసారిగా..

World Cup: చరిత్ర సృష్టించిన వన్డే ప్రపంచకప్.. 48 ఏళ్లలో తొలిసారిగా..

Cricket World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఇప్పటివరకు ఒక మిలియన్‌కు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. అది కూడా మరో 6 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కావడం గమనార్హం. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ రికార్డు పూర్తైంది.

World Cup: బుమ్రా, సిరాజ్‌, రాహుల్‌కు విశ్రాంతి.. తుది జట్టులోకి ఆ నలుగురు.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

World Cup: బుమ్రా, సిరాజ్‌, రాహుల్‌కు విశ్రాంతి.. తుది జట్టులోకి ఆ నలుగురు.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

India vs Netherlands: ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఇదే ఊపులో నెదర్లాండ్స్‌పై కూడా గెలిచి ఓటమెరుగని జట్టుగా సెమీస్‌లోకి అడుగుపెట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఇప్పటికే జట్టు సెమీస్ చేరడం, పాయింట్ల పట్టికలో కూడా మొదటి స్థానం ఖరారు కావడం, ప్రత్యర్థి చిన్న జట్టే కావడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి.

World Cup: 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ప్రత్యర్థి నవీన్ ఉల్ హక్

World Cup: 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ప్రత్యర్థి నవీన్ ఉల్ హక్

Naveen-ul-Haq retirement: అప్ఘానిస్థాన్ స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా చాలా కెరీర్ ఉన్నప్పటికీ 24 ఏళ్ల చిన్న వయసులోనే వన్డేల నుంచి రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సౌతాఫ్రికాతో అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ నిర్ణయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు.

ODI World Cup: ఒకే మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు.. చరిత్ర సృష్టించిన డికాక్

ODI World Cup: ఒకే మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు.. చరిత్ర సృష్టించిన డికాక్

South Africa: దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ఒకవైపు బ్యాటింగ్‌లో రాణిస్తూనే.. మరోవైపు వికెట్ కీపింగ్‌లో డికాక్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే బ్యాటింగ్‌లో నాలుగు సెంచరీలు చేసిన అతడు.. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ఏకంగా ఆరు క్యాచ్‌లు అందుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి