Home » Nitish Kumar
Nitish Kumar: బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘జనాభా నియంత్రణ’ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. చదువుకున్న మహిళలకు గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుందంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Bihar Assembly: బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇటీవల జనాభా నియంత్రణ విషయంలో మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. చదువుకున్న మహిళలకు తన భర్తల్ని ఎలా నియంత్రించాలో తెలుసంటూ.. అసెంబ్లీ సాక్షిగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో క్యాస్ట్ కోటా రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన రిజర్వేషన్ సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిహార్ లో రిజర్వేషన్ కోటా ఇకపై 65 శాతం పెరగనుంది.
మన భారతదేశంలో జనాభా గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో.. అప్పుడప్పుడు రాజకీయ నేతలు ‘జనాభా నియంత్రణ’పై తమ సూచనలు ఇస్తుంటారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా అదే పని చేశారు. కానీ..
జనాభా నియంత్రణపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతున్నట్లు బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తెలిపారు. తన వ్యాఖ్యలు మహిళలను బాధించి ఉంటే క్షమించాలని కోరారు.
బీహార్‌లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి నితీష్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కులగణన ఆధారంగా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితిపై డాటాను బీహార్ ప్రభుత్వం మంగళవారంనాడు విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన డాటా ప్రకారం, బీహార్‌లో జనరల్ కేటగిరిలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన భూమిహార్ల లో పేదరికం ఎక్కువగా ఉందని తేలింది.
ఇండియా కూటమిని కాంగ్రెస్ అసలు పట్టించుకోవట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar)చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) స్పందించారు. కాంగ్రెస్(Congress) పార్టీకి ఇండియా కూటమి కీలకమని ఖర్గే ఉద్ఘాటించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పార్టీకి ముఖ్యమని.. అందుకే ఇండియా కూటమి(INDIA Alliance) తదుపరి సమావేశం నిర్వహించట్లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు(Lokh Sabha Elections) పూర్తి స్థాయిలో సన్నద్ధత కావట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) పార్టీ త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిందని.. దీంతో మొత్తంగా లోక్ సభ ఎన్నికలను విడిచిపెట్టిందని వ్యాఖ్యానించారు.
బిహార్(Bihar) ప్రభుత్వ విజయాలను పార్టీలు వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవద్దని సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) కోరారు. బిహార్ స్టేట్ పవర్ (హోల్డింగ్) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం రూ.14 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ఆవిష్కరించిన ఆయన ఏడు పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు.