Home » Nellore
Chandrababu MSME Parks: నారంపేట ఎంఎస్‌ఎంఈ పార్కులో నేరుగా పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. షెడ్లు, కరెంటు అందుబాటులో ఉంటాయని. కామన్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఆయా ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఆ రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ తెలిపింది.
సీఎం చంద్రబాబు గురువారం నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని పాళెం గిరిజన కాలనీలో పింఛన్ల పంపిణీ, మేడే సందర్భంగా కార్మికులతో ముచ్చటిస్తారు. అలాగే ఏపీఐఐసీకి చెందిన ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులు పరిశీలిస్తారు. యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కులను ముఖ్యమంత్రి ఆత్మకూరు నుంచే ప్రారంభిస్తారు.
సింహాచలంలో ప్రసాద స్కీం పనులు ఆలశ్యంగా మొదలయ్యాయని, నెలన్నర రోజుల కిందటనే చందనోత్సవంపై రివ్యూ చేశామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వల్ల దురదృష్టకర సంఘటన చోటుచేసుకుందని, విపత్తు వల్ల ఒక క్యూ లైన్ నిలిపివేయడం జరిగిందని మంత్రి చెప్పారు.
Land Mafia: నెల్లూరు జిల్లాలోని వింజమూరులో ఉన్న సర్కార్ భూములపై భూమాఫియా సరికొత్త కుట్రలకు తెరదీసింది. గత యాభై ఏళ్లుగా ఈ భూములు భూ మాఫియా చేతిలో చిక్కుకున్నాయి. అయితే ఈ భూముల విలువ వందకోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
జన్మనిచ్చిన కన్నతల్లినే కొడుకు చిత్రహింసలు పెడుతున్న అతి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో రామారావు అనే వ్యక్తి తన తల్లిని మానసికంగా, శరీరకంగా వేదనకు గురిచేస్తున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్ లింక్‌పై నమ్మి రూ.2.46 కోట్లు కోల్పోయిన మహిళ కేసులో ఏడుగురు సైబర్ నేరగాళ్లను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు.తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలని మోసగాళ్లు నమ్మించి మోసం చేశారు.
Pawan on Pahalgam Attack: ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చారంటే ఎంతటి దారుణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏం జరిగిందో వారు చెబుతుంటే తనకే పేగులు మెలబెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
Nellore Police High Alert: నెల్లూరు జిల్లా కోర్టులో కొన్నేళ్ల క్రితం బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు కుక్కర్‌లో బాంబు పెట్టి పేల్చారు. అదే తరహాలో కేరళ, తమిళనాడు, చిత్తూరులో కూడా సంఘటనలు చోటు చేసుకున్నాయి. దానిపై ఎన్‌ఐఏ విచారణ జరిపింది.
అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న మధుసూధనరావు.. తల్లిదండ్రులు, అత్తమామల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకి వచ్చారు. కొన్నేళ్లుగా బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.