Home » NDA Alliance
YS Sharmila: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మోదీ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు మద్దతు ఉపసహరించుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఉంటే.. ఎంత అభివృద్ధి అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధించడం కష్టమని చెప్పారు. హోదాతోనే అభివృద్ధి, సంపద సృష్టి సాధ్యమవుతుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
Pawan Kalyan: జనసేన నేతలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున కూడా స్పందించవద్దని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
GVL Narasimha Rao: ఏపీ అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు. ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్‌గా అక్టోబర్‌లో రూ.2800 కోట్లు అందజేశారని జీవీఎల్ నరసింహరావు అన్నారు.
Guntur Politics: గుంటూరు నగర పాలక సంస్థలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. కౌన్సిల్ సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ఈ సమావేశం గురించి వైసీపీ సభ్యులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొని వైసీపీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
YS Sharmila: పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, వారి రాజ్యాంగం వల్ల ప్రజా స్వామ్యం కాపాడపడుతోందని తెలిపారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ పార్టీ జపం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.
YS Sharmila:ఆరోగ్య శ్రీ బిల్లులను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
ఎంపీలు కేశినేని శివనాథ్, బాలశౌరిలకు కీలక పదవి వరించింది. మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యులుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడై పది రోజులు గడుస్తున్నా.. సీఎం ప్రమాణ స్వీకారం జరగలేదు. మహాయుతి కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వచ్చినా.. సీఎంగా ఎవరు ఉండాలనే విషయంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఆలస్యమైందనే ప్రచారం జరిగింది. ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ సీఎం పదవి డిమాండ్ చేయకపోయినా..
వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డిపై మరో కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వర్రా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిని తొలగించమని అడిగితే కులం పేరుతో దూషించారని, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.
వైసీపీ ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 99 శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే సరిపోతుందని అన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఏడు శాతం ఎక్కువగా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.