Home » Narendra Modi
పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని సౌదీ చేరుకున్నారు. కానీ ఉగ్రదాడి తర్వాత, ప్రధాని మోదీ ఈరోజు ఢిల్లీకి తిరిగి వచ్చారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. విదేశీయులు, భారతీయ పర్యాటకులు లక్ష్యంగా ఉగ్రవాదులు మతం అడిగి కాల్పులకు తెగబడ్డారు.
పహల్గాం ఉగ్రదాడి విషాదాన్ని భారతీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాహుల్ గాంధీ తదితరులు దాడిని అమానవీయంగా మరియు దిగ్ర్భాంతికరంగా అభివర్ణించారు, ఉగ్రవాదులను వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమమవుతుండగా, మోదీ ప్రజాదరణపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు కురిపించారు. భారత్ అణుశక్తి లక్ష్యాల సాధనలో అమెరికా భాగస్వామిగా నిలుస్తుందని స్పష్టం చేశారు
ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ కృతనిశ్చయాన్ని ఇలాంటి దుష్టశక్తుల పన్నాగాలు నీరుగార్చలేవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
సౌదీ అరేబియాతో చిరకాలంగా ఉన్న మైత్రీ బంధాన్ని సౌదీ పర్యటనకు ముందు ఒక ప్రకటనలో ప్రధానమంత్రి మోదీ గుర్తుచేసుకున్నారు. సౌదీ అరేబియాతో భారత్‌కు చిరకాల, చారిత్రక సంబంధాలున్నాయని, ఇటీవల కాలంలో ఈ సంబంధాలు మరింత ఊపందుకున్నాయని చెప్పారు.
భారత్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన హైలైట్గా నిలిచింది. మోదీతో సమావేశం, వాణిజ్య చర్చలు, కుటుంబానికి విందు, పిల్లలకు నెమలి ఈకలతో పలు ప్రత్యేక క్షణాలు చోటుచేసుకున్నాయి
ప్రజలే దేవుళ్లు అనే దృక్పథంతో పని చేయాలని సివిల్ సర్వీసెస్ అధికారులకు ప్రధాని మోదీ సూచించారు. అభివృద్ధి చిట్టచివరి వ్యక్తికీ చేరాలన్నదే లక్ష్యమన్నారు
Pop Francis Visit To India: 2016లో పోప్ ప్రాన్సిస్ మాట్లాడుతూ.. తాను ఇండియా వస్తానని అన్నారు. 2017లో ఆయన ఇండియాలో పర్యటించాల్సి ఉండింది. అయితే, అనుకోని కారణాల వల్ల ఆయన ఇండియాకు రాలేకపోయారు. చివరగా 1999లో పోప్ జాన్ పాల్ 2 ఇండియాలో పర్యటించారు. అప్పటి నుంచి పోప్ ఇండియాకు రాలేదు.