Pop Francis: ఇంకొన్ని నెలల్లో భారత్ పర్యటన.. ఇంతలోనే పోప్ మరణం..
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:06 PM
Pop Francis Visit To India: 2016లో పోప్ ప్రాన్సిస్ మాట్లాడుతూ.. తాను ఇండియా వస్తానని అన్నారు. 2017లో ఆయన ఇండియాలో పర్యటించాల్సి ఉండింది. అయితే, అనుకోని కారణాల వల్ల ఆయన ఇండియాకు రాలేకపోయారు. చివరగా 1999లో పోప్ జాన్ పాల్ 2 ఇండియాలో పర్యటించారు. అప్పటి నుంచి పోప్ ఇండియాకు రాలేదు.
రోమన్ క్యాతలిక్ చర్చ్ పెద్ద పోప్ ప్రాన్సిస్ చనిపోయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రోమ్‌లోని జెమెల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 88 ఏళ్ల వయసులో సోమవారం ఉదయం 7.35 గంటలకు కన్నుమూశారు. పోప్ మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అభివృద్ధిపై పోప్ ప్రాన్సిస్‌కు ఉన్న కమిట్‌మెంట్ తనకు స్పూర్తిగా నిలిచిందన్నారు. భారత ప్రజలపై ఆయనకు ఉన్న అప్యాయత ఎన్నటికీ మరువలేనిదన్నారు.
భారత్‌తో మంచి అనుబంధం
1999లో పోప్ జాన్ పాల్ 2 ఇండియాలో పర్యటించారు. ఢిల్లీలోని ఓ చర్చిలో పాపల్ డాక్యుమెంట్ ఇవ్వడానికి ఆయన వచ్చారు. ఆ తర్వాత 2017లో పోప్ ప్రాన్సిస్ ఇండియాకు రావాల్సి ఉండింది. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. అనుకోని కారణాల వల్ల అప్పుడు ఆయన ఇండియా రాలేకపోయారు. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ వాటికన్ సిటీ వెళ్లారు. అక్కడ పోప్ ప్రాన్సిస్‌ను కలిశారు. ఇండియాలో పర్యటించాలని విజ్ణప్తి కూడా చేశారు. పోప్ ప్రాన్సిస్ దీనికి సానుకూలంగా స్పందించారు. ఇండియాకు వస్తానని మాటిచ్చారు. 2026 మొదట్లో పోప్ ప్రాన్సిస్ ఇండియా పర్యటన ఉండింది. ఇంతలోనే ఆయన కన్నుమూశారు.
1964 నుంచి 1999 వరకు ఇలా..
రోమన్ క్యాతలిక్ చర్చి పెద్దలు ఇద్దరు మాత్రమే ఇండియాలో పర్యటించారు. 1964లో పోప్ పాల్ 6 ముంబైకి వచ్చారు. ఇంటర్నేషనల్ యూచరిస్టిక్ కాంగ్రెస్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత పోప్ జాన్ పాల్ 2 1986లో చెన్నై వచ్చారు. చెన్నైతో పాటు ఇండియాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పోప్ జాన్ పాల్ 2 మళ్లీ 1999లో ఇండియా వచ్చారు. ఆ తర్వాత 1999 నుంచి ఇప్పటి వరకు పోప్ ఇండియాకు రాలేదు. 2000 సంవత్సరంలో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వాటికల్ సిటీ వెళ్లారు. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ పోప్ ప్రాన్సిస్‌ను కలిసి ఇండియాకు ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి
Waqf Bill Supreme Court hearing: వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
Inflation: సాధారణ ప్రజలకు గుడ్ న్యూస్.. 67 నెలల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం