Home » Nara Chandra Babu Naidu
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ (YSRCP) నేతలు కోనసీమలో అల్లర్లు సృష్టించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో "వారాహి విజయభేరి" భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మంత్రాలయంలో మార్పు వస్తోందని చెప్పారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, ఉరుకుందు ఈరన్న స్వామి ఆశీస్సులు మనకే ఉన్నాయని తెలిపారు.
కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్‌లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పీహెచ్డీ చేశారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. మనల్ని మనం కాపాడుకోవాలంటే అందరం కర్రలు చేతపట్టి రోడ్ల మీదకి రావాలని పిలుపునిచ్చారు. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో మళ్లీ అరాచకం సృష్టిస్తుందని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
జంపేటను జిల్లా చేయకుండా ఇక్కడి వారికి సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. రాజంపేటలో గురువారం నాడు అరుదైన కాంబినేషన్ చోటుచేసుకుంది. ఒకే వేదికపై చంద్రబాబు, మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆసీనులయ్యారు. రాజంపేట సభకు పెద్దసంఖ్యలో కూటమి నేతలు, అభిమానులు తరలివచ్చారు. కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నేతలు, అభ్యర్థుల మధ్య ఇలాంటి మామూలే అనుకుంటే.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నామినేషన్‌కు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు..
ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోతోంది.. దీంతో హైకమాండ్ దిక్కుతోచని స్థితిలో పడింది..
సినిమాను తలిపించేలా గులక రాయి దాడి డ్రామా జరిగిందని ఎంపీ, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఉండి అసెంబ్లీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raju) అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో దైవం దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...నిన్ననే నామినేషన్ వేసి..ఆనవాయితీ ప్రకారం శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చానని తెలిపారు. చంద్రగిరి ప్రాంతాన్ని కొందరు చందనగిరిగా మార్చారని విరుచుకుపడ్డారు.
ఈ సైకో(జగన్)ను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ప్రజాగళం’లో భాగంగా పాతపట్నం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? అని ప్రశ్నించారు.తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు రాస్తాడా అని నిలదీశారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu) జడ్జి ముందు ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు..