Home » Nara Bhuvaneswari
గుంటూరు: గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం వెళ్లగొట్టి.. కొత్తవి తీసుకురాక.. యువతకు ఉపాధి లేకుండా చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘సంక్షేమం పేరుతో నిధులన్నీ దోచేసింది చాలక రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేశాడు. హైకోర్టు మినహా ఏమీ మిగలనివ్వలేదు. మొత్తం దోచేసి జేబులు నింపుకొని తినేస్తున్నాడు. ఇక మిగిలింది ప్రజల ఆస్తులే. అవైనా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. చంద్రబాబు తెచ్చిన పఽథకాలను ఆపేసి పేదల జీవితాల్లో అంధకారం నింపిన రాక్షసుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఇలాంటి రాక్షసుణ్ణి తరిమేయడానికి రేపటి ఎన్నికల్లో ఓటనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) పిలుపునిచ్చారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం ముగియనుంది. ఏప్రిల్ 13వ తేదీతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అందుకు సంబంధించి విజయవాడలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో హెరిటేజ్ సంస్థ కి సంబంధించిన డాక్యుమెంట్లను కార్యాలయ సిబ్బంది తగులబెట్టారు. హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఆపి ఇదేంటని ప్రశ్నించగా.. పత్రాలు తగలబెట్టి వీడియోలు తమకి పెట్టమని సిట్ అధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని సీఐడీ కార్యాలయం సిబ్బంది చెప్పారట.
రాష్ట్ర యువత ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండవల్లిలోని చంద్రబాబు (Chandrababu) నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా భువనేశ్వరికీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కేక్ తినిపించారు.
ఈ అరాచక జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే యువతకు భవిష్యత్తు ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర గురువారం విజయవాడలోని కానూరులో కొనసాగింది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్ర నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో కొనసాగుతోంది. ఆమెకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం నాడు వెంకటాచలం మండలంలోని పుంజలూరుపాడు గ్రామంలో ఆరణి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండె పోటుకు గురై నారాయణ రెడ్డి (54) మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh) అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడు అవసరం అని, ఆ సరైన నాయకుడు చంద్రబాబేనని(Chandrababu) పేర్కొన్నారు నారా భువనేశ్వరి(Bhuvaneshwari). శనివారం నాడు నెల్లూరు(Nellore) జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మహిళలతో భువనేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడారు.
Andhrapradesh: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణ భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం గూడూరు ఏ-5 కన్వెన్షన్‌లో నిర్వహించిన మహిళాశక్తి సమావేశంలో భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ చేపట్టారు.