• Home » Nalgonda News

Nalgonda News

Nalgonda: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పల్నాడు వైసీపీ నాయకుల మకాం!

Nalgonda: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పల్నాడు వైసీపీ నాయకుల మకాం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసీపీ నేతలు తెలంగాణకు మకాం మార్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సరిహద్దులోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో కృష్ణపట్టె గ్రామాలు, సమీప పట్టణాల్లో తిష్ఠవేశారు.

Nalgonda: తాగునీటి ట్యాంకులో మృతదేహం..

Nalgonda: తాగునీటి ట్యాంకులో మృతదేహం..

అది నల్లగొండ జిల్లా కేంద్రంలోని 12వ వార్డు పాతబస్తీ..! 1,500 కుటుంబాలకు మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకు ద్వారా తాగునీరు అందుతోంది. కొన్నాళ్లుగా తాగునీటిలో దుర్వాసన వస్తోందంటూ కొందరు స్థానికులు మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. మునిసిపల్‌ సిబ్బంది ట్యాంక్‌ ఎక్కి తనిఖీ చేస్తే.. నీటిలో మృతదేహం తేలియాడుతూ కనిపించింది.

TG NEWS: నీటి వాటర్ ట్యాంక్‌ను చూసి జనం షాక్.. అందులో చూస్తే...!?

TG NEWS: నీటి వాటర్ ట్యాంక్‌ను చూసి జనం షాక్.. అందులో చూస్తే...!?

నీటి వాటర్ ట్యాంక్‌ను చూసి జనం షాక్‌కు గురయ్యారు. అందులో ఏముందని చూస్తే అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీరా అందులో మృతదేహం ఉందని చూసి భయాందోళనలకు గురవుతున్నారు.

Hyderabad: మా అమ్మను బతికించండి!

Hyderabad: మా అమ్మను బతికించండి!

ఆ రోజు పనికి వెళ్లకపోతే మరుసటి రోజు ఐదువేళ్లు నోట్లోకి వెళ్లలేని స్థితిలో కూడా ఉన్నంతంలో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబానికి క్యాన్సర్‌ మహమ్మారి ఆ సంతోషం కూడా లేకుండా చేసింది. ఇంటిపెద్ద భార్య కు క్యాన్సర్‌ సోకడంతో వైద్యం కోసం ఇప్పటికే లక్షల్లో ఖర్చు పెట్టారు.

Nalgonda: ‘యాదాద్రి ప్లాంట్‌’ దొంగల ముఠా పట్టివేత..

Nalgonda: ‘యాదాద్రి ప్లాంట్‌’ దొంగల ముఠా పట్టివేత..

ఏడాదిగా నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (వైటీపీఎ్‌స)లో యంత్ర పరికరాలు, జీఐ బండిల్స్‌, అల్యూమినియం షీట్లు ఏడాదిన్నరగా చోరీ అవుతున్నాయి. వైటీపీఎ్‌సలో చొరబడుతున్న దొంగలు, విలువైన వస్తువులను స్ర్కాప్‌గా అమ్ముకొని కోట్లలో సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలొచ్చాయి.

 Miryalaguda: రైలు కింద పడి ఇద్దరి బలవన్మరణం..

Miryalaguda: రైలు కింద పడి ఇద్దరి బలవన్మరణం..

వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో కలహాలు సృష్టించింది. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ, అవివాహితుడైన ఓ యువకుడు నెరిపిన బంధం.. వివాదాలు రేపింది. చివరకు ఆ ఇద్దరు రైలు కింద పడి చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ

Nalgonda: ముగ్గురు తహసీల్దార్లు అరెస్టు!

Nalgonda: ముగ్గురు తహసీల్దార్లు అరెస్టు!

అసైన్డ్‌ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని నల్లగొండ జిల్లా నిడమనూరులో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు, ఓ వీఆర్‌వోను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని 9 ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్‌మెంట్‌ కమిటీ తీర్మానం లేకుండానే గతంలో పలువురికి పట్టాలు చేశారు.

KTR: రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది

KTR: రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది

రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నకిరేక‌ల్‌‌‌కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రుణ మాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను దగా చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Etela Rajender: రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు

Etela Rajender: రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు

తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాకు 5-10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మండిపడ్డారు. కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. తరుగుతో సంబంధం లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు

Nalgonda: సోషల్‌ మీడియా వసూళ్లు

Nalgonda: సోషల్‌ మీడియా వసూళ్లు

గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఆపి.. సోషల్‌ మీడియా పేరిట పాత్రికేయులుగా వ్యవహరిస్తున్న వారు అర్ధరాత్రి వేళ వసూళ్లకు దిగారు. రూ.4.50 లక్షలు డిమాండ్‌ చేశారు. రూ.2 లక్షలు ఇచ్చినా.. మిగతా సొమ్ము కోసం పట్టుబట్టారు. దీంతో వాహనదారు పోలీసులను ఆశ్రయించాడు. వారు రంగంలోకి దిగి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి