Home » Money
పింఛన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వృద్ధులకు శాపంగా మారింది. ఇంటింటికీ పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. ఈ నెల కూడా బ్యాంకుల్లోనే జమ చేశారు. దీంతో పింఛన సొమ్ము తీసుకునేందుకు శనివారం ఉదయం నుంచే బ్యాంకుల వద్ద మండుటెండలో పడిగాపులు కాశారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మధ్యాహ్నం నుంచి జమ చేయడం మొదలు పెట్టారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆదాయం పన్ను శాఖ జరిపిన దాడుల్లో రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు విలువచేసే నగదు, ఆభరణాలు పట్టుబడ్డాయి. 2019లో రూ.390 కోట్లు పట్టుబడగా, దానికంటే182 శాతం అధికంగా ఈసారి నగదు పట్టుబడింది. మే 30వ తేదీ వరకూ పట్టుబడిన సొమ్ము దాదాపు రూ.1100 కోట్లు విలువ చేస్తుందని ఆదాయం పన్ను వర్గాలు తెలిపాయి.
Personal Finance: స్థిర ఆదాయాన్ని అందించే పథకాలలో ‘ఫిక్స్‌డ్ డిపాజిట్లు’(Fixed Deposit) అగ్రస్థానంలో ఉన్నాయి. మార్కెట్ పెట్టుబడిదారులకు(Investments) నష్ట భయం లేకుండా హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా పోస్టాఫీసులు(Post Office Fixed Deposit Schemes) ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ పేషీలో ఓ ఉద్యోగి పాత ఫైళ్ల (ఎంబీ బుక్కు)పై బదిలీపై వెళ్లిన కమిషనర్ సంతకాలతో డబ్బులు డ్రా చేసిన వైనంపై ఇంటెలిజెన్స్ పోలీసులు దృష్టి సారించారు. ఈ తతంగంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘పాత ఫైళ్లపై బిల్లులు’ అనే కథనం ప్రచురించింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు నాలుగురోజులుగా కూపీ లాగుతున్నారు.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మళ్లీ పాత పద్ధతిలో నగదు లావాదేవీలే జరుపుతున్నారు. పోలింగ్‌కు వారం రోజుల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలను (ఫోన పే, గుగూల్ పే) మాత్రమే అనుమతించారు. ఆయా రోజుల్లో ఎక్కడా నగదు తీసుకోలేదు. ఈనెల 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలను బంద్ చేశారు. జిల్లాలో 127 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటిలో 90 శాతం దుకాణాల్లో ప్రస్తుతం నగదు లావాదేవీలు
దేశంలో ప్రస్తుతం రాజకీయ పార్టీల పేర్లకంటే.. ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్(ED), సీబీఐ(CBI) సంస్థల పేర్లే అధికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ(Lok Sabha Elections) ఈ సంస్థల హాడావుడి అంతా ఇంతా లేదు. ఏమాత్రం సమాచారం అందినా.. వెంటనే రైడ్స్ జరుపుతున్నాయి. కోట్లాది రూపాయలను ఈడీ, సీబీఐ సంస్థలు..
క్రెడిట్ కార్డు లిమిట్ ఎంతున్నా.. దాన్ని బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. క్రెడిట్ కార్డులో ఉన్న నగదుని నెట్ బ్యాంకింగ్ ఫీచర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి(Money Transfer from Credit Card to Bank Account) ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గల 17 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మెదక్ లోక్ సభ సెగ్మెంట్‌లో గల పటాన్ చెరులో ఓ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు.
అమరాపురం మండలం మద్దనకుంట చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండ త రలిస్తున్న రూ. 38లక్షల నగదును పట్టుకున్నట్లు ఎస్‌ఐ జనార్దననాయుడు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం పావగడ తాలుకా మరిదాసనహళ్లికి చెందిన మంజునాథ్ స్విఫ్ట్ కారులో తుమకూరు నుంచి ఆంధ్రప్రదేశ అమరాపురం మండలం మద్దనకుంట మీదుగా మరిదాసనహ ళ్లికి వెళ్లుతున్న సమయంలో అతని వద్ద 38లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించామని, నగదుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకెళ్లుతుండగా నగదును సీజ్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ డబ్బు పంపిణీని ప్రారంభించింది. ఓటుకు రూ.2 వేల ప్రకారం బుధవారం పంచినట్లు తెలిసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరవర్గం నియోజకవర్గంలో తిష్టవేసి.. డబ్బు పంపిణీ వ్యవహారాలను చూస్తోందని ప్రచారం జరుగుతోంది. గ్రామాల్లో ముఖ్యమైన నాయకులకు డబ్బులు చేరవేసి.. అక్కడి నుంచి పంచాయతీల వారీగా డబ్బులు చేరవేస్తున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ పరిధిలో వలంటీర్లను దగ్గర పెట్టుకుని.. వైసీపీ...