Home » MLC Kavitha
BRS Internal Rift: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన కుమార్తె కవితపై సీరియస్‌గా ఉన్నారు. ఆమె లేఖ లీక్ వ్యవహారం జరిగి పది రోజులు దాటినా కేసీఆర్ ఇంత వరకు కవితను పిలిచి మాట్లాడలేదు. మరోవైపు కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ దూరంగా ఉన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా కేసీఆరే తనకు ఏకైక నాయకుడని కవిత అంటున్నా.. గులాబీ బాస్ నుంచి ఆమెకు పిలుపు రాకపోవడానికి కారణం అదేనా..
రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతితోపాటు తెలంగాణ సమాజం సహించబోదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు.. నోటీసులు ఇవ్వడాన్ని సహించమని రేవంత్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్న సమస్యలు సాధారణమేనని తెలిపారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్ చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన తెలంగాణ జాగృతి సంస్థ పెద్ద అవినీతి సంస్థ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. అవినీతి సొమ్మును జాగ్రత్తగా కాపాడుకోవటానికే కవిత తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తోందని మధుయాష్కీ గౌడ్ విమర్శించారు.
యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఎఫ్) ఇకపై తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్ట్‌ల ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి వేల కోట్ల అదనపు భారం పడుతుందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మేధావులు మర్చిపోయినటువంటి చరిత్రను బీజేపీ పార్టీ పరిచయం చేస్తుందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు తమపై దండయాత్ర చేస్తే ఊరుకునేది లేదని రఘునందన్ రావు హెచ్చరించారు.
తనకంటూ ప్రత్యేక అజెండా ఏదీ లేదని, పెద్దాయనను(కేసీఆర్‌ను ఉద్దేశించి) ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
సైనికులకు బాసటగా రాహుల్‌గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అపర ఖాళీ మాత ఇందిరా గాంధీ అని వాజ్‌పాయ్ కొనియాడిన విషయం కిషన్‌రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.