Kavitha: యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఇక.. జాగృతి అనుబంధ సంస్థ: ఎమ్మెల్సీ కవిత
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:11 AM
యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఎఫ్) ఇకపై తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఎఫ్) ఇకపై తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న బీసీ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చేవరకు తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో కవిత సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా యూపీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. యూపీఎఫ్ కన్వీనర్‌గా బొల్లా శివశంకర్, కో ఆర్డినేటర్‌గా ఆలకుంట హరి, సలహాదారుగా గట్టు రాంచందర్‌రావు, మరో 50 మందిని కోకన్వీనర్లుగా నియమించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజీలో పెట్టే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. త్వరలోనే బీసీ బిల్లులు సాకారమయ్యేందుకు పోరాట కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.