Home » Miss World 2025
ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలైన యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లిలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు.
Miss World 2025: . 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తోంది. మొత్తం 120 దేశాలకు సంబంధించిన సుందరీమణులు ఈ పోటీలో పాల్గొంటున్నారు.
Miss World contestants: తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. పోటీల్లో భాగంగా పలు ప్రాంతాల్లో అందాల భామలు పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
సంప్రదాయ చీరకట్టు, నుదుట బొట్టు, జడ కొప్పు, మల్లెపూలు ధరించి.. ప్రపంచ సుందరి పోటీదారులు తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆట, పాటలతో నృత్యాలు చేశారు.
అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా? ఇదేనా ప్రజాపాలన అంటూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు నిధులిస్తామని ముందుకొచ్చిన స్పాన్సర్లు... అధికారుల నిర్లక్ష్యంతో వెనక్కి వెళ్లిపోయారు.
ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులకు ఎదురైన అనుభవాలు ఇవి. కాకతీయుల శిల్పకళావైభవానికి ప్రతీకైన చారిత్రాత్మక నిర్మాణాన్ని చూసి వారంతా మైమరిచిపోయారని స్థానిక గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ చెప్పారు.
Miss World Contestants: అందాల భామలు బుధవారం వరంగల్, ములుగు జిల్లాలో పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. 35 మందితో కూడిన సుందరీమణులతో కూడిన ఒక బృందం వరంగల్ నగరంలోని వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. అలాగే..
ప్రపంచ సుందరి పోటీదారులు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు లాడ్‌బజార్ దుకాణాలు సందర్శించి గాజులు, ముత్యాల దండలు కొనుగోలు చేశారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో మిస్ వరల్డ్-2025 పోటీదారులు నేడు హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఈ నేపధ్యంలో రేవంత్ ప్రభుత్వం పాతబస్తీలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించింది.