Home » Minister Narayana
మున్సిపల్ వర్కర్లకు జీతం పెంపు విషయంలో ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి. మంత్రి నారాయణ మాట్లాడుతూ యూనియన్ ప్రతినిధులతో ముసాయిదా మరియు ఆర్థిక శాఖతో సలహాలు చేస్తామని తెలిపారు.
Minister Narayana: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై కూడా రుణాలు తెచ్చుకుందని అన్నారు. అమృత్ పథకానికి కేంద్రం ప్రభుత్వం నిధులిచ్చినా ఏపీ వాటా విడుదల చేయకపోవడంతో నిధులు విడుదల కాలేదని చెప్పారు.
Minister Narayana: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఏపీకి చాలా నష్టం చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్థంగా పనులు చేశారని మంత్రి నారాయణ విమర్శించారు.
CM Chandrababu Naidu: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. పర్యాటక శాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
మూడేళ్లలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలని, ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్ధేశించారు. సీఎం ఆదేశాల మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
అమరావతి పునఃప్రారంభ సభ ఊహించిన దానికంటే అద్భుతంగా జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. మోదీ పర్యటనతో ప్రజల్లో ఉత్సాహం రెట్టింపవడంతో సభ విజయవంతమైందని పేర్కొన్నారు
పదేళ్ల తర్వాత మళ్లీ మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు ప్రారంభమవుతుండటం ప్రజల్లో ఆశాజ్యోతి రగిలించింది. ప్రపంచ టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది
Modi Amaravati Visit: వర్షం వస్తే పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు నారాయణ తెలిపారు. దీనిపై పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు ముందుగా చేశారన్నారు.
సింహాచలంలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి భక్తులు మృతి చెందడం బాధాకరమని, మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.
Minister Narayana: మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.