Home » Medak
మురికికూపంగా మారిన కాలనీలు! మోకాలి లోతులో చేరిన బురద నీళ్లతో కంపుకొడుతున్న ఇళ్లు! మోటార్లతో అదేపనిగా నీటిని తోడేస్తున్నా పుట్టుకొస్తున్న కొత్త వరదతో సంపులను తలపిస్తున్న అపార్ట్‌మెంట్ సెల్లార్లు
భారీ వర్షాలు, వరదలు వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు దామోదరరాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ధనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు ఇప్పటివరకు రూ.1,157.46 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా సర్కారుకు ఆ శాఖ నివేదికను అందజేసింది.
నిజాం హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు మీద నుంచి నీరు ప్రవహించడం... తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రాజెక్టు సామర్థాన్ని మించి రెండున్నర రెట్ల మేర అధికంగా వరద రావడంతో సమీప గ్రామాల ప్రజలు హడలిపోయారు.
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టాలపై నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.
మెదక్ జిల్లా రామాయంపేటలోని వరద బాధిత ప్రాంతాల్లో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. సిద్దిపేట - రామాయంపేట 765 డీజీ జాతీయ రహదారిపై నందిగామ వద్ద కల్వర్టు కుంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.
మెదక్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 30.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. హావేలిఘనాపూర్ మండలం సర్దనలో 30 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. నాగపూర్‌లో 27 సెం. మీ వర్షపాతం నమోదైంది. చేగుంటలో 22 సెం.మీ, రామయంపేట మండలంలో 20 సెం. మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)ల వద్ద రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అరకొర స్టాక్ వస్తుండటంతో తెల్లవారకముందే అన్నదాతలు పీఏసీఎ్‌సలకు పరుగులు తీస్తున్నారు.
ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతుండడంతో గోదావరి, కృష్ణ నదులు ఉగ్రరూపం దాల్చాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం 6.65లక్షల క్యూసెక్కులకు చేరింది.