Home » Maoist Encounter
Operation Karre Gutta: కేంద్ర భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు సన్ స్ట్రోక్ అడ్డంకిగా మారింది. బీజాపూర్ - తెలంగాణ సరిహద్దుల్లో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు వడ దెబ్బ తగిలింది.
కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ జోరందుకుంటోంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ గుట్టలను జల్లెడపట్టేందుకు భద్రతాబలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నాయి.
దశాబ్దాలుగా ఈ గుట్టలు నక్సలైట్లకు కంచుకోటలుగా ఉంటుండగా.. అబూజ్‌మఢ్, ఇతర ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు పెరగడంతో.. ఉన్న క్యాడరంతా కర్రెగుట్టలపైకి చేరుకున్నట్లు భద్రతాబలగాలు ఉప్పందుకున్నాయి.
మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమవడం అనేది అనూహ్యమైన పరిణామం, అయితే దీనితో పాటు గిరిజనుల పరిస్థితి మరింత కష్టంగా మారింది. ప్రభుత్వాలు, మావోయిస్టుల మధ్య ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు, శాంతి చర్చలన్నీ సమగ్రంగా, విస్తృత దృక్పథంతో జరగాలని కవితా రచయిత గారి సూచన
Operation Karreguttalu: తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కోసం 2 వేల మంది భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.
మావోయిస్టులు 30 రోజుల పాటు కాల్పులు విరమించి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చర్చలు ప్రారంభించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు వారు అంగీకరించారు
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోలు హతమయ్యారు.
బస్తర్‌లో జరుగుతున్న మారణహోమాన్ని ఆపాలని.. కగార్ నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కోరింది. తమ డిమాండ్‌ను ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ నిరాకరించారని, ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధంగా లేదని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ప్రజలు భయోత్పాత వాతావరణంలో జీవిస్తున్నారని, యువతి-యువకులు పారిపోతున్నారని, ఈ దిశగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరింది.
తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలపైకి ప్రజలెవరూ రావొద్దని, ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న దాడుల నుంచి స్వీయ రక్షణ కోసం గుట్ట చుట్టూ బాంబులు పెట్టామని మావోయిస్టులు ఓ ప్రకటనలో హెచ్చరించారు.
మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం ఒకేరోజు ఏకంగా 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు.