• Home » Manipur Violence

Manipur Violence

 Re polling: రేపు ఈ 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్

Re polling: రేపు ఈ 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్

మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శనివారం ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 19న ఈ పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఓటింగ్ చెల్లదని ప్రకటించి తాజాగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Lok Sabha Elections 2024: తొలి విడత పోలింగ్...మణిపూర్‌లో హింస

Lok Sabha Elections 2024: తొలి విడత పోలింగ్...మణిపూర్‌లో హింస

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి విడత పోలింగ్‌లో భాగంగా మణిపూర్‌లో శుక్రవారంనాడు హింసాత్మక ఘటనలు వెలుగుచూశాయి. బూత్‌లను స్వాధీనం చేసుకోవడం, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్ ఈస్ట్‌లోని ఖోంగ్మాన్‌లో ఎన్నికల ప్రకియను అడ్డుకునేందుకు సాయుధ దుండగులు ఓ పోలింగ్‌ బూత్‌లలోకి ప్రవేశించారని, ప్రాక్సీ ఓటింగ్ చేశారని వార్తలు వెలువడ్డాయి.

Elections 2024: మణిపుర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమే.. అమిత్ షా కీలక ప్రకటన..

Elections 2024: మణిపుర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమే.. అమిత్ షా కీలక ప్రకటన..

చొరబాటు ద్వారా మణిపుర్ జనాభాను మార్చే ప్రయత్నాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) సంచలన ప్రకటన చేశారు. మణిపుర్ ను విచ్ఛిన్నం చేసే శక్తులు, ఐక్యం చేసే శక్తుల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.

Manipur: మద్యం దుకాణాలు బంద్

Manipur: మద్యం దుకాణాలు బంద్

రాష్ట్రంలో గత ఏడాది మే మాసంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నిర్వహించే రోజులతోపాటు కౌంటింగ్ ప్రక్రియ జరిగే రోజు.. రాష్ట్రంలో మద్యం విక్రయాలు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Manipur: మణిపూర్‌లో తుపాకీల కలకలం.. నలుగురు అరెస్ట్..

Manipur: మణిపూర్‌లో తుపాకీల కలకలం.. నలుగురు అరెస్ట్..

మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో రైఫిళ్లు కలిగి ఉన్న నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు SLR రైఫిల్స్‌తో పాటు ఏడు మొబైల్ ఫోన్‌లు, ఒక వాకీ టాకీ సెట్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో సలాం రామేశ్వర్ సింగ్, టోంగ్‌బ్రామ్ గ్యాంజిత్ సింగ్ అలియాస్ చింగ్లెన్సనా, పుఖ్రేమ్ ఇంగోచా సింగ్, తోక్‌చోమ్ టెంబా అలియాస్ వఖీబా ఉన్నారు.

Manipur: చురచంద్‌పుర్ ఘటన.. మెజిస్ట్రేట్ విచారణకు సీఎం ఆదేశం..

Manipur: చురచంద్‌పుర్ ఘటన.. మెజిస్ట్రేట్ విచారణకు సీఎం ఆదేశం..

మణిపుర్ లో మరోసారి చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ స్పందించారు. చురచంద్‌పూర్ హింసాకాండపై విచారణ జరిపేందుకు మెజిస్టీరియల్ విచారణ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Manipur: 1961 తర్వాత మణిపూర్‌లో స్థిరపడిన వారి తరలింపు సాధ్యమేనా..?

Manipur: 1961 తర్వాత మణిపూర్‌లో స్థిరపడిన వారి తరలింపు సాధ్యమేనా..?

1961 తర్వాత మణిపూర్‌లో స్థిరపడిన వారిని తరలిస్తామని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సోమవారం (నిన్న) ప్రకటన చేశారు. కులాలు, వర్గాలు, మతాలకు అతీతంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. దాంతో మణిపూర్‌లో అక్రమంగా తలదాచుకున్న వారిని తరలించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

CM Biren Singh: రాష్ట్రం నుంచి వాళ్లను తరిమేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

CM Biren Singh: రాష్ట్రం నుంచి వాళ్లను తరిమేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత మణిపూర్‌కి వచ్చి స్థిరపడిన వారిని గుర్తించి, రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని కుండబద్దలు కొట్టారు. కులం, కమ్యూనిటీని పట్టించుకోకుండా.. 1961 తర్వాత రాష్ట్రానికి వచ్చిన వాళ్లందరికి వెనక్కు తిరిగి పంపిస్తామని ఉద్ఘాటించారు.

Manipur: తిరుగుబాటు గ్రూపుతో శాంతి చర్చలు: సీఎం

Manipur: తిరుగుబాటు గ్రూపుతో శాంతి చర్చలు: సీఎం

హింసాకాండతో ఇటీవల అట్టుడికిన మణిపూర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు రాష్ట్రం ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. మణిపూర్‌ లోయలోని ఒక తిరుగుబాటు సంస్థతో శాంతి చర్చలు జరుపుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆదివారంనాడు తెలిపారు. చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని వెల్లడించారు.

Manipur Violence: మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి కొత్త సమస్య.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఎమ్మెల్యేల తిరుగుబాటు

Manipur Violence: మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి కొత్త సమస్య.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఎమ్మెల్యేల తిరుగుబాటు

ఈ ఏడాది మే నెలలో 3వ తేదీన మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ల విషయంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత.. పెద్ద వివాదంగా మారింది. కుల హింస మంటల్లో ఆ రాష్ట్రం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి