Home » Mangalagiri
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో సంక్షేమంపై చర్చకు తాము రెడీ అని.. సీఎం జగన్ సిద్ధమా? ! అని సవాల్ చేశారు.
‘పోయిన ఎన్నికల సమయంలో జగన్ గెలిస్తే రాజధానిని అమరావతి నుంచి మార్చేస్తాడని టీడీపీ నేతలు చెప్పినా వినలేదు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పట్ల ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో ఓడించేందుకు సీఎం జగన్(CM Jagan) రూ.300 కోట్లు పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. శనివారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట, ప్రాతూరు చర్చిసెంటర్, మెల్లెంపూడి మసీదు వద్ద నిర్వహించిన రచ్చబండ సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం అందించిన పెన్షన్లు, సంక్షేమంపై పేటీఎం బ్యాచ్‌తో జగన్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఈరోజు మంగళగిరిలో నిర్వహించిన బీసీ సదస్సులో మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram ) తెలుగుదేశం(TDP) పార్టీలో చేరారు. అయితే ఈ విషయంలో ఊహించిందే జరిగింది. జయరాంను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీచేస్తానని వైసీపీ అధిష్ఠానానికి తెలిపారు.
Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి జోరు పెంచింది. ఇప్పటికే ‘రా కదలి రా..’, ‘శంఖారావం’ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు చేరువైన టీడీపీ.. ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో బీసీల సమగ్రాభివృద్ధి, సంరక్షణ కోసం బీసీ డిక్లరేషన్‌ను కూటమి విడుదల చేయబోతోంది. ఇందుకోసం ‘జయహో బీసీ’ (Jayaho BC) సదస్సు మంగళగిరిలో జరుగుతోంది..
గుంటూరు జిల్లా: మంగళగిరిలో ఓ నిరుద్యోగి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఉద్యోగాల పేరుతో తనలాంటి నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. జగన్ ప్రభుత్వం తీరుకు నిరసనగా వైసీపీ జెండాలు చేతబట్టి సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జి గంజి చిరంజీవికి సెగ తగిలింది. చిరంజీవిని బాప్టిస్ట్ పేట వాసులు నిలదీశారు. పేదవారంటే ఎవరు... పెత్తందారులు అంటే ఎవరంటూ నిలదీశారు. పెత్తందారులు అయిన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు సిమెంటు రోడ్లు ఎందుకు ఉన్నాయి?.. పేదవాళ్లమయిన తమ ఇంటి ముందు ఎందుకు గుంటల రోడ్లు ఉన్నాయని ప్రశ్నించారు.
తాము అధికారంలోకి వస్తే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆ వ్యవస్థలను రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు.
జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిమ్స్ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని వివరాలు తెలిపేలా ఓ ఫ్లెక్సీని బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. పూర్తిగా కేంద్రం నిధులతోనే ఎయిమ్స్ నిర్మాణం చేశారని ఫ్లెక్సీలో వివరించారు. అయితే ఫ్లెక్సీ ఏర్పాటుపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.