Home » Mancherial
మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, పోచంపహాడ్ శివారులో ఇండస్ర్టియల్ హబ్ కోసం పేద రైతుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటుందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ముల్కల్లలోని దళిత రైతులను కలిశారు. ఆయన మాట్లాడుతూ ముల్కల్ల, వేంపల్లి, పోచంపహాడ్‌లో ఇండస్ర్టియల్ పార్కు కోసం సుమారు 295 ఎకరాల భూమి సేకరణకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అనుచరులు గ్రామాల్లోని దళిత రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
సొంత ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఏమిటనేది సందిగ్ధంలో పడింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి నోచుకోలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు వృథాగా పడి ఉన్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతుభరోసా రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఊత్కూర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ యేటా రైతుకు పంట పెట్టుబడికి రూ.15వేలు ఇస్తామంటూ ఏడాది అనంతరం రూ.12వేలు ఇస్తామనడం సరికాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు అమలు సందర్భంగా ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం నిర్వహించారు.
సామాన్య మహిళలను ఆర్థికాభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళ శక్తి పథకంలో భాగంగా ముల్కల్ల పంచాయతీలోని వీరాంజనేయ గ్రామ సంఘం రాజరాజేశ్వరి చిన్న సంఘం సభ్యురాలు సుద్దాల విజయ పొందిన సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం గూడెం ఎత్తిపోతల నీటిని ఆదివారం కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల చీఫ్ ఇంజనీర్ బద్రినారాయణతో కలిసి పూజలు చేసి నీటిని విడుదల చేశారు.
పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తను గుర్తిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజర య్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సయ్యద్ పసివుల్లాతోపాటు పది మంది డైరెక్టర్ల చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయిం చారు.
కవ్వాల టైగర్ జోన్‌లో బర్డ్‌వాచ్ పర్యాటకులను ఆకర్షించింది. ఆదివా రం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బర్డ్‌వాచ్‌కు 15 మంది పర్యాటకులు తరలివచ్చారు. శనివారం రాత్రి ఇందన్‌పల్లి రేంజ్‌లోని అటవీ ప్రాంతంలోని గన్‌శెట్టి కుంట వద్ద ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చేశారు.
సొంతిళ్లు పేద, మధ్యతరగతి గూడు కల్పించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంది రమ్మ పేరుతో ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయిం చింది. ఇందుకుగానూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో మహిళల పేరిట దరఖాస్తులు స్వీకరించింది. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందకుండా కేవలం అర్హులకు లబ్ధి జరిగేలా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి చేసి మంచిర్యాలను సర్వాంగ సుందరంగా మారుస్తానని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని మహా ప్రస్తాన నిర్మాణ పనులను, మార్కెట్ ఏరియాలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలను పరిశీలించారు.