• Home » Mancherial

Mancherial

నాణ్యమైన ధాన్యం తీసుకవచ్చి మద్దతు ధర పొందాలి

నాణ్యమైన ధాన్యం తీసుకవచ్చి మద్దతు ధర పొందాలి

నాణ్యమైన ధాన్యం కొను గోలు కేంద్రాలకు తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని డీఆర్‌డీఏ డీపీఎం వేణుగోపాల్‌ సూచించారు. నెల్కివెంకటాపూర్‌, మదాపూర్‌, ధర్మరావుపేట, పెద్దపేట, లక్ష్మికాంతపూర్‌ గ్రామాల్లో గురువారం కేంద్రాలను సందర్శిం చారు.

సన్న ధాన్యం పక్కదారి

సన్న ధాన్యం పక్కదారి

సన్నరకం ధాన్యం పక్కదారి పడుతోంది... ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతోపాటు బోనస్‌ ప్రకటించినా రైతులు ప్రైవేట్‌కే మొగ్గు చూపుతున్నారు. తేమ శాతంతోపాటు వారు సూచించిన విధంగా బియ్యం గింజ పొడవు, మందం ఉంటేనే సన్నరకంగా పరిగణిస్తున్నారు. రైతులు గ్రామాలకు వచ్చిన వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీంతో రేషన్‌ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేయాలనే ప్రభుత్వం నిర్ణయం ఆచరణ సాధ్యమయ్యేలా అగుపించడం లేదు.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల నిరసన

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల నిరసన

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నస్పూర్‌లోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని గోదాం ఇన్‌చార్జి శంకర్‌కు వినతిపత్రం అందించారు.

స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

దేవాపూర్‌లోని ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీలో స్ధానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కంపెనీ పర్మినెంటు వర్కర్స్‌ లోకల్‌ యూనియన్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ అన్నారు.

నర్సింగాపూర్‌ను కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దు

నర్సింగాపూర్‌ను కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దు

మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామాన్ని మంచిర్యాల కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దని బీజేపీ నాయకులు అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు.

ప్రాణహిత-చేవెళ్లపై చిగురిస్తున్న ఆశలు

ప్రాణహిత-చేవెళ్లపై చిగురిస్తున్న ఆశలు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారానే తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచి కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంటుంది. అందుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు సన్నాహాలను ప్రారంభించింది.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో అం దిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు శ్రీని వాసరావు, హరికృష్ణలతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. వేలాల శివారు ఇసుక క్వారీలో అవకతవకలు నెలకొన్నాయని జాడి యేసయ్య దరఖాస్తు అందజేశారు.

నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి

నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి

చెన్నూరు మండలం బాబూరావు పేట శివారులో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి పట్టాలను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ ఏవోకు అందించారు.

  ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలి

ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలి

అత్యవసర సమయంలో ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. సోమవారం రైతువేదిక ప్రాంగణంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి 108 అంబులెన్స్‌ను ప్రారం భించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అంబు లెన్స్‌ను ప్రారంభించామన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్క రించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డి మాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదు ట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అభినవ్‌, బండి సత్య నారాయణ, ద్యాగం శ్రీకాంత్‌లు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయిం బర్స్‌మెంట్స్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి