Home » Mallareddy
బీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medcal MLA Chamakura Mallareddy) చెప్పారు.
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నిక ( LokSabha Election )ల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( Mallareddy ) తెలిపారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు( KTR )ను మల్లారెడ్డి కలిశారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేశానని ఈసారి కూడా అవకాశం కల్పించాలని కేటీఆర్‌కు చెప్పానని మల్లారెడ్డి అన్నారు..
Telangana: భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై శామీర్‌పేట్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును మల్లారెడ్డి కోరారు.
హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి (Former Minister Malla Reddy) తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై స్పందించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని అన్నారు.
Telangana: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
Telangana: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం యశోదా ఆస్పత్రిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మల్లారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా రెండుమూడు రోజులు తరువాత డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు.