Home » Maganti Gopinath
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలో మోహరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. చూడటానికి క్లాస్‌గా కనిపించే ఆయన మాస్ లీడర్ అని.. నాకు మంచి మిత్రుడని గుర్తుచేసుకున్నారు.
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ టికెట్ మాగంటి గోపీనాథ్ కుటుంబానికే దక్కుతుందని ఆయన సోదరుడు వజ్రనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభను గురువారం నిర్వహించారు.
ఉపఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ అన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ గురి పెట్టింది. త్వరలో జరగబోయే ఉప ఎన్నిక కావడంతో అధికార పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీఆర్‌ఎస్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రత్యేక దృష్టి సారించింది.
ఏడాదిన్నరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముగ్గురు నేతలను కోల్పోయింది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నేతలు కావడంతో అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈనెల 8వ తేదీన అనారోగ్యంతో మృతిచెందారు.
KCR: మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యలను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. గోపీనాథ్ భౌతికకాయాన్ని చూసి విలపించారు. గంభీరమైన వ్యక్తిత్వంతో కనిపించే ఆయన కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్‌కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాంగటి అకాల మృతిపట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
Nara Lokesh: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాసానికి వచ్చిన ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి మాగంటి భౌతికాయానికి నివాళులర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని, గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరమని అన్నారు.
CM Chandrababu: జూబ్లీహిల్స్‌లోని మాగంటి గోపీనాథ్ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నట్లు సమాచారం. అలాగే మాజీ సీఎం కేసీఆర్ మరికాసేట్లో రానున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. కాగా గోపీనాథ్ నివాసంలోనే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు.
Maganti Gopinath funeral: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. మరోవైపు ఏఐజీ హాస్పిటల్ నుంచి మాగంటి గోపీనాథ్ పార్ధి దేహాన్ని మాదాపూర్ కావూరి హిల్స్‌లోని మాగంటి నివాసానికి తరలించారు.