• Home » Madhavi Latha

Madhavi Latha

Lok Sabha Polls 2024: బీజేపీ దెబ్బకు.. పాత బస్తీలో కొత్త దోస్తీ!

Lok Sabha Polls 2024: బీజేపీ దెబ్బకు.. పాత బస్తీలో కొత్త దోస్తీ!

బీజేపీ (BJP) దెబ్బకు పాత బస్తీలో బద్ధ శత్రువులు ఏకమయ్యారా!? ఇక్కడ ఎంఐఎంకు ఎంబీటీ పరోక్ష మద్దతు ఇస్తోందా!? మజ్లిస్‌కు (AIMIM)సహకరించడానికే పోటీ నుంచి తప్పుకుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి తాజా పరిణామాలు..

Elections 2024: ఎంఐఎంలో భయం మొదలైందా.. హైదరాబాద్‌లో అదే జరగనుందా..!

Elections 2024: ఎంఐఎంలో భయం మొదలైందా.. హైదరాబాద్‌లో అదే జరగనుందా..!

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోలింగ్‌కు మరో 17రోజుల సమయం మాత్రమే ఉంది. ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్‌ఎస్ (BRS) వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 17లోక్‌సభ స్థానాలు ఉన్నప్పటికీ.. అందరి గురి కేవలం 16 స్థానాలే.. ఈ నియోజకవర్గాల్లోనే గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు పోటీపడుతుంటారు. మరో నియోజకవర్గం గురించి అసలు ప్రస్తావనే ఉండదు.. ఎందుకంటే ఎన్నికలకు ముందే అక్కడి ఫలితం ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. అదే హైదరాబాద్ నియోజకవర్గం. ఓవైసీ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గం అడ్డాగా మారింది.

Lok Sabha Polls: రాజాసింగ్‌ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

Lok Sabha Polls: రాజాసింగ్‌ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(BJP candidate Kompella Madhavilatha) బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ పార్టీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal MLA Rajasingh) ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

BJP: పోలీసులు ఈసీ కోసం పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ కోసం వర్క్ చేస్తున్నారా..: మాధవీలత

BJP: పోలీసులు ఈసీ కోసం పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ కోసం వర్క్ చేస్తున్నారా..: మాధవీలత

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలీసులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతలో ఉన్నారా...? అని మండిపడ్డారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Madhavilatha: పాతబస్తీలో ఒవైసీ బ్రదర్స్‌ ఆటలు సాగనివ్వను...

Madhavilatha: పాతబస్తీలో ఒవైసీ బ్రదర్స్‌ ఆటలు సాగనివ్వను...

పాతబస్తీలో ఇప్పటి నుంచి ఒవైసీ బ్రదర్స్‌(Owaisi Brothers) చట్టవ్యతిరేక ఆటలు సాగనివ్వనని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత(Madhavilatha) హెచ్చరించారు. ఆదివారం ఐఎస్‏సదన్‌ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి..

TS Elections: అందరిచూపు ‘హైదరాబాద్‌’పైనే!

TS Elections: అందరిచూపు ‘హైదరాబాద్‌’పైనే!

నగరంలోని హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి ఎరుగని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీని ఢీకొట్టడానికి ధార్మికవేత్త, కళాకారిణి, వ్యాపారవేత్త డాక్టర్‌ కొంపెల్ల మాధవీలతకు బీజేపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది.

TS Politics: హైదరాబాద్ ఎంపీ స్థానంలో అసదుద్దీన్‌పై మాధవీలత పోటీ!.. ఆమె ట్రాక్ రికార్డు ఇదే...

TS Politics: హైదరాబాద్ ఎంపీ స్థానంలో అసదుద్దీన్‌పై మాధవీలత పోటీ!.. ఆమె ట్రాక్ రికార్డు ఇదే...

నగరంలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానంలో మజ్లి్‌సకు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్‌ల చైర్‌పర్సన్‌ మాధవీలతకు టికెట్‌ ఖరారు చేసింది. మజ్లి్‌సకు దీటుగా ఉండేందుకే మాధవీలతకు టికెట్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్‌ఫాదర్‌ ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి