Home » Madhavi Latha
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఆమె ప్రవర్తనపై ఎంఐఎం అభ్యంతరం తెలపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆమెపై మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు మాధవీలతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హైదరాబాద్: నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటింగ్ సరళని పరిశీలించారు. బూత్‌లో కూర్చున్న ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించమని కోరి ఓటర్ ఐడీల వెరిఫికేషన్ చేశారు.
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవిలత(Madhavilatha) సోమవారం పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు.
తెలంగాణలో ఒకవైపు ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరిట వసూళ్లు జరుగుతుండగా.. హైదరాబాద్‌లో మరో ఆర్(రజాకార్) ట్యాక్స్ కూడా వసూలవుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై చర్చ బాగా జరుగుతోంది. ఒక ఆర్.. తెలంగాణాకు సంబంధించినది కాగా, మరో ఆర్.. ఢిల్లీది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధినేత ఏక్‌నాథ్ షిండే పిలుపు మేరకు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్ధి మాధవీలత(Madhavilatha)కు సంపూర్ణ మద్దతు శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రకటించింది.
పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉండాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ(Rajasthan Chief Minister Bhajanlal Sharma) ప్రజలను కోరారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ ధర్మం, మోదీపై అద్దంకి దయాకర్ అభ్యంతర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సీఈఓ వికాస్ రాజ్‌ను సోమవారం బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత (Madhavi latha) కలిసి ఫిర్యాదు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత కీలకమైనవో ఓటు హక్కు వినియోగం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే ఎన్నికల సంఘం మొదలుకుని, సమాజంలోని వివిధ రంగాల ప్రముఖుల వరకు ‘ఓటు వేయాలంటూ’ ప్రజలకు పిలుపునిస్తుంటారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పై తెలంగాణలోని(Telangana) మొఘల్ పురా పోలీస్ స్టేషన్‌లో(Moghalpura Police Station) కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అసలు అమిత్ షా పై ఎందుకు కేసు నమోదు చేశారో చూద్దాం..
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత(BJP candidate Madhavilatha) కొంపెల్ల స్ట్రాంగ్ వుమెన్ అని నటి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renudesai) తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొంది.