Home » Machilipatnam
మచిలీపట్నంలోని గ్రీన్‌కో కార్యాలయం, గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తాజాగా పేర్ని నానిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో పేర్ని నానిని పోలీసులు ఏ-6గా నమోదు చేశారు. కృష్ణా జిల్లా, బందరు తాలుక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఆయనను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తాజాగా రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావులను పోలీసులు అరెస్టు చేశారు.
మచిలీపట్నం మండలం పొట్లపాలెంలోని గోడౌన్ నుంచి పీడీఎస్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య, గోడౌన్ యజమాని జయసుధకు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం నోటీసులు జారీచేశారు.
ఆంధ్రప్రదేశ్: కృష్ణా జిల్లా మచిలీపట్నం పంపుల చెరువు కాలనీకి చెందిన ఓ బాలిక 8వ తరగతి చదువుతూ స్థానికంగా నివాసం ఉంటోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు మద్యం, గంజాయి సేవిస్తూ కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లి వస్తున్న బాలికపై ఆ గంజాయి బ్యాచ్ కన్నుపడింది.
అరెస్టు కాకుండా ఉండేందుకు పేర్ని నాని కుటుంబం రాజకీయ పలుకుబడితో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 20 రోజులకుపైగా నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసులు, కూటమి నేతల సహకారం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
గోదాముల నుంచి పీడీఎస్ బియ్యం మాయం కేసులో నోటీసులు జారీ అయినా మాజీ మంత్రి పేర్ని నాని ఆదివారం పోలీసుల ముందు హాజరు కాలేదు.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారంనాటికి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ వాళ్ల ఆహ్వానం మేరకే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని, జోగి రమేష్ వస్తున్నారన్న సమాచారం తనకు ఏ మాత్రం తెలియదని.. తాను అక్కడకు వెళ్లిన తర్వాత జోగి రమేష్ వచ్చారని కొనకళ్ల నారాయణరావు వివరించారు.