Home » London
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్లనున్నారు. మే 15వ తేదీ వారు లండన్‌కు పయనమవ్వనున్నారు. అయితే మే 14వ తేదీ మధ్యాహ్నాం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైయస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
యూకేకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ టీకా కొవిషీల్డ్‌తో అత్యంత అరుదుగా రక్తం గడ్డకట్టే అవకాశముందని సంస్థ అంగీకరించింది.
మాజీ ప్రియురాలిపై రెండేళ్ల క్రితం హత్యాయత్నం చేసినందుకు భారత దేశానికి చెందిన శ్రీరాం అంబర్ల (25)కు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ లండన్‌లోని ఓల్డ్ బెయిలీ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రెస్టారెంట్లో ఉండగా ఆమెను కత్తితో పొడిచినట్టు రుజువు కావడంతో ఈ శిక్ష వేసింది.
మాజీ గర్ల్ ఫ్రెండ్‌ని హత్య చేసేందుకు యత్నించిన హైదారబాద్ యువకుడికి లండన్ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో కత్తితో తిరుగుతున్నందుకు మరో 12 మాసాల జైలు శిక్షను అతడికి కోర్టు విధించింది.
లండన్లోని కోవెంట్రీ సిటీ తెలుగు యువత లింగా రవితేజ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
బ్రిటన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లండన్‌లో చైస్తా కొచ్చర్ అనే విద్యార్థినిని చెత్త ట్రక్కు ఢీకొట్టడంతో ఆమె అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి చీస్తా కొచ్చర్ (33) లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కొచ్చర్ పీహెచ్‌డీ చేస్తున్నారు. యూనివర్సిటీ నుంచి ఇంటికి సైకిల్‌పై వస్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రక్ ఢీ కొంది. తీవ్ర గాయాలైన కొచ్చర్ అక్కడికక్కడే మృతిచెందారు. కొచ్చర్ మృతిని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్‌లో(London) ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తన కూతురు వామికతో(Vamika) కలిసి లండన్‌లో వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ(Kohli) వ్యక్తిగత కారణాల వల్ల ఇండియా - ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు బ్రేక్ పడింది. ఈ యాత్ర ఐదు రోజుల పాటు నిలిపివేశారు.
ఆధునిక ఫారెన్సిక్ సాంకేతిక సాయంతో లండన్ పోలీసులు 30 ఏళ్ల నాటి హత్య కేసును ఛేదించారు. ఈ కేసులో ఓ ఎన్నారై దోషిగా తేలడంతో అతడికి శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష పడింది.