• Home » Lok Sabha Elections

Lok Sabha Elections

Congress: ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వివాదాస్పద హామీ

Congress: ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వివాదాస్పద హామీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ప్రజలకు ఇస్తున్న హామీలు శృతిమించుతున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఏకంగా ఒక ముందడుగేసి.. ఇద్దరు భార్యలకు స్కీం ప్రకటించారు.

Elections 2024: సగం కంప్లీట్.. ఆధిక్యం ఎవరిది..?

Elections 2024: సగం కంప్లీట్.. ఆధిక్యం ఎవరిది..?

దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచేదెవరు.. కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు.. ఇప్పటికే మూడు విడతల్లో సగానికి పైగా లోక్‌సభ స్థానాల్లో(Lok Sabha Seats) ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మొదటి మూడు విడతల్లో పోలింగ్ తక్కువ నమోదైంది. బీజేపీకి ఈ మూడు విడతల్లో ఎదురుదెబ్బ తగిలిందని ఇండియా కూటమి ఆరోపిస్తుంటే.. ఎన్డీయే(NDA) బలం గతంకంటే పెరిగింది.. ఇండియా కూటమికి గతంలో వచ్చిన సీట్లు రావంటూ బీజేపీ(BJP) చెబుతోంది. ఈ క్రమంలో మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

AP Elections: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!

AP Elections: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!

ఓట్ల పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది పార్టీల ప్రచారం, రాజకీయ పార్టీల మధ్య విమర్శలు.. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు.. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది అభ్యర్థుల్లో టెన్షన్.. వీటన్నింటికి తోడు చివరి రెండు రోజులు అంటే పంపకాల సమయం.. ఇటీవల కాలంలో ఓటుకు నోట్ల పంపిణీ ఎక్కువైపోయింది. కావాలని ఓటర్లు అడగకపోయినా.. డబ్బులిస్తే ఓట్లు వేస్తారనే ఆశతో ప్రధాన పార్టీలు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి.

Lok Sabha Polls: యూపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. మాయవతి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం..

Lok Sabha Polls: యూపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. మాయవతి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం..

ఉత్తరప్రదేశ్‌‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు కొనసాగుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని టార్గెట్ చేశారు. మరోవైపు అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాయావతి. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మాయావతి తప్పించారు. ఏడాది క్రితం ఇచ్చిన వారసత్వ బాధ్యతల నుంచి కూడా తప్పించినట్లు ప్రకటించారు. దీంతో మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Lok Sabha Polls:  స్మృతి ఇరానీని శర్మ ఓడిస్తారా.. అమేథిలో ఏం జరుగుతోంది..?

Lok Sabha Polls: స్మృతి ఇరానీని శర్మ ఓడిస్తారా.. అమేథిలో ఏం జరుగుతోంది..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో రాయ్‌బరేలీ, అమేథీ ముందు వరుసలో ఉన్నాయి. గాంధీ కుటుంబానికి ఈ రెండు స్థానాలు ఎప్పటినుంచో సంప్రాదాయక సీట్లుగా ఉన్నాయి. కానీ 2019లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూడగా.. రాయ్‌బరేలీలో సోనియాగాంధీ విజయం సాధించారు. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో.. రాయ్‌బరేలీ నుంచి ఆమె వారసుడిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది.

Lok Sabha Polls: రిజర్వేషన్లపై రాద్దాంతం.. రాజ్యంగం ఏం చెబుతోంది..

Lok Sabha Polls: రిజర్వేషన్లపై రాద్దాంతం.. రాజ్యంగం ఏం చెబుతోంది..

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రోజుకో అంశం తెరమీదకు వస్తోంది. ప్రతిపక్షం ఒక అంశం తెరపైకి తీసుకొస్తే.. దానికి ధీటుగా అధికార పక్షం మరొక అంశాన్ని లేవనెత్తుతోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి అజెండా పక్కకు వెళ్లిపోయింది. అధికారంలోకి వస్తే ఏం చేస్తాం.. గతంలో ఏం చేశామనే ముచ్చట్లే లేవు. ఎన్నికల ప్రచారం మొత్తం రెండే రెండు అంశాల చుట్టూ తిరుగుతున్నాయి.

PM Modi Pileru Public Meeting Live Updates: ప్రధాని మోదీ మాస్ స్పీచ్..

PM Modi Pileru Public Meeting Live Updates: ప్రధాని మోదీ మాస్ స్పీచ్..

PM Narendra Modi Pileru Public Meeting Live Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి దూకుడుగా ప్రచారం చేస్తోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే ఏపీలో వరుసగా పర్యటిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా పీలేరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో

BIG Debate: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సూపర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

BIG Debate: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సూపర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

ఏపీలో ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజులు సమయం మాత్రమే ఉంది. గెలుపు మాదేనంటూ ఎన్డీయే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. వికసిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. మరోవైపు అధికార వైసీపీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతం టార్గెట్ చేస్తోంది. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో ఎన్డీయే కూటమి విజయవకాశాలు ఎలా ఉన్నాయి. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వలన తెలుగుదేశం, జనసేన జోడికి లాభమా.. నష్టమా..

Lok Sabha Elections: రాహుల్‌కు అగ్ని పరీక్ష.. ఆ ప్రశ్నకు నో ఆన్సర్..!

Lok Sabha Elections: రాహుల్‌కు అగ్ని పరీక్ష.. ఆ ప్రశ్నకు నో ఆన్సర్..!

దేశంలో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు రాహుల్‌గాంధీకి అగ్నిపరీక్షగా మారాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పటికీ.. కాంగ్రెస్‌ నాయకులు ఎక్కువమంది రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Lok Sabha Polls: యూపీలో పార్టీలకు వణుకు పుట్టిస్తున్న ఓటర్లు.. పోలింగ్ శాతంపై టెన్షన్..

Lok Sabha Polls: యూపీలో పార్టీలకు వణుకు పుట్టిస్తున్న ఓటర్లు.. పోలింగ్ శాతంపై టెన్షన్..

ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే యూపీలో గెలవాలి. ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ ఎక్కువు సీట్లు గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారానికి దగ్గరవుతుందనేది వాస్తవం. దీంతో ఈ ఎన్నికల్లో యూపీలో సత్తా చాటేందుకు ఎన్డీయే, ఇండియా కూటములు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలుండగా.. మూడు విడతల పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి