• Home » Lok Sabha Elections

Lok Sabha Elections

AP Politics: కాస్కో అంటూ ముందుకొస్తున్న ఓ పార్టీ.. వెనక్కి తగ్గుతున్న మరో పార్టీ..

AP Politics: కాస్కో అంటూ ముందుకొస్తున్న ఓ పార్టీ.. వెనక్కి తగ్గుతున్న మరో పార్టీ..

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు కావొస్తుంది. ఫలితాల కోసం మరో 15 రోజులు ఆగాల్సిందే. ఈలోపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. మరోవైపు పందేం రాయుళ్ల హడావుడి. నియోజకవర్గాలవారీ ఇప్పటికే కోట్లలో పందేలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై ఇప్పటికే వందల కోట్ల రూపాయిలు పందేలు కట్టినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు వరకు వైసీపీకి చెందిన నేతలు పందేలు కట్టేందుకు భారీగా ముందుకు రాగా.. ప్రస్తుతం సర్వే సంస్థల నుంచి వచ్చిన సమాచారం, గ్రామాల వారీ క్యాడర్ అందిస్తున్న వివరాలతో వైసీపీ నేతలు పందేలు కట్టడంలో కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుచేస్తే దేశం దివాళా తీయడం ఖాయం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుచేస్తే దేశం దివాళా తీయడం ఖాయం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ చెబుతున్న మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తే భారత్ దివాళా తీయడం ఖాయమని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Polls 2024)ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ముంబయిలో పర్యటించారు.

Bhatti Vikramarka: ఒడిసాలో భట్టి విస్తృత ప్రచారం

Bhatti Vikramarka: ఒడిసాలో భట్టి విస్తృత ప్రచారం

ఒడిసాలో ఐదో దశ ఎన్నికలు జరిగే లోక్‌సభ నియోజక వర్గాల్లో డిప్యూటీ సీఎం భట్టి విస్తృత ప్రచారం చేపట్టారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయన ఒడిసాలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్‌ ముగిసిన అనంతరం మంగళవారమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం అక్కడి నుంచి ఏఐసీసీ అగ్రనేతలతో పాటుగా ప్రత్యేక విమానంలో ఒడిసాకు వెళ్లిన భట్టి.. బోలాంగిరి పరిధిలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు.

PM Modi: వారు గెలిస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు..విపక్షాలపై మోదీ తీవ్ర ఆరోపణలు

PM Modi: వారు గెలిస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు..విపక్షాలపై మోదీ తీవ్ర ఆరోపణలు

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, ఎస్పీతో కూడిన విప‌క్ష ఇండియా కూట‌మి గెలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్‌లతో కూల్చివేస్తారని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Elections: అన్నా.. ఎవరు గెలుస్తరే..?

Lok Sabha Elections: అన్నా.. ఎవరు గెలుస్తరే..?

ప్రభుత్వ కార్యాలయాలు.., ప్రైవేట్‌ సంస్థలు.., నలుగురు ఎక్కడ కలిసినా ఒకటే చర్చ. అన్నా, ఎన్నికలు ఎలా జరిగాయి..? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలువబోతున్నారు..? ఏ పార్టీకి ఎన్ని స్థానాలొస్తాయి..? సాధారణ పౌరుల నుంచి ఉన్నతాధికారుల వరకు రాజకీయాలపై ఆసక్తి ఉన్న చాలామంది ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తున్నారు.

Elections 2024: తెలంగాణలో ఎవరి లెక్కలు వారివి.. లాభ పడబోతున్నది ఎవరు..?

Elections 2024: తెలంగాణలో ఎవరి లెక్కలు వారివి.. లాభ పడబోతున్నది ఎవరు..?

తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్ పూర్తైంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు స్థానాల్లోనే బీఆర్‌ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత ఆయా పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి.

Elections 2024: ఏపీలో గెలిచేది వాళ్లే.. బెట్టింగ్ రాయుళ్ళ అంచనా ఇదే..!

Elections 2024: ఏపీలో గెలిచేది వాళ్లే.. బెట్టింగ్ రాయుళ్ళ అంచనా ఇదే..!

ఏపీలో పోలింగ్ ముగిసింది. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఓవైపు ఎన్డీయే కూటమి అంచనా వేస్తుంటే.. మరోవైపు వైసీపీ సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్టీల అంచనాలు ఇలా ఉంటే.. బెట్టింగ్ రాయుళ్ళ అంచనా మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

AP Elections: పెరిగిన పోలింగ్.. నేతల్లో టెన్షన్.. ఓటరు మాత్రం కూల్..

AP Elections: పెరిగిన పోలింగ్.. నేతల్లో టెన్షన్.. ఓటరు మాత్రం కూల్..

ఏపీలో పోలింగ్ ముగిసింది. జనం తమ తీర్పును ఈవీఎంలలో బంధించారు. దీంతో రాజకీయ పార్టీలు, నేతల్లో టెన్షన్ కొనసాగుతుండగా.. ఓటరు మాత్రం కూల్ అయిపోయాడు. తాను ఎలాంటి తీర్పు ఇవ్వాలనుకున్నాడో పోలింగ్ బూత్‌కు వెళ్లి తన తీర్పును రిజర్వు చేసి వచ్చాడు. జూన్‌4న అసలు తీర్పు వెల్లడికానుంది. ఓటరు ఏ పార్టీని ఆదరించాడనేది మరో 20 రోజుల్లో తెలుస్తుంది. అప్పటివరకు నాయకుల్లో టెన్షన్ కొనసాగనుంది.

Elections 2024: పోలింగ్‌లో టాప్ ఆ నియోజకవర్గాలే.. విజయం వరించేది ఎవరినంటే..

Elections 2024: పోలింగ్‌లో టాప్ ఆ నియోజకవర్గాలే.. విజయం వరించేది ఎవరినంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 79.04 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఈ పోలింగ్ శాతం ఒకటి నుంచి రెండు శాతం మధ్యలో పెరిగే అవకాశం ఉండొచ్చు. ఇప్పటివరకు ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా ధర్మవరం నియోజకవర్గంలో 88.61 శాతం పోలింగ్ నమోదైంది.

Loksabha Elections 2024: సౌత్‌లో బీజేపీ బలపడిందా..?

Loksabha Elections 2024: సౌత్‌లో బీజేపీ బలపడిందా..?

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిన భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జోస్యం చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి