Home » Lok Sabha Election 2024
భారత సైన్యంలో చేరేందుకు మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్ నియామక పథకంపై సమీక్ష నిర్వాహించాలని జేడీయూ నేత కేసీ త్యాగి స్పష్టం చేశారు. ఈ అగ్నిపథ్ నియామక పథకంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆయన పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బుధవారం న్యూడిల్లీలో సమావేశమయ్యాయి. ఆ క్రమంలో ఎన్డీయే అధినేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు ఎన్నుకున్నాయి. అయితే తాజాగా ఏర్పాటవుతున్న మోదీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కింగ్ మేకర్‌లుగా అవతరించారు.
లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections) ముగిశాయి. గెలిచిన వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకంటే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలకు పోలైన ఓట్లు మూడు రెట్లు పెరిగాయి.
గత లోక్‌సభలో ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(మజ్లి్స్) పార్టీకి ఇద్దరు సభ్యులుండగా ఈసారి ఒకే ఒక్క సభ్యుడితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మజ్లిస్ మొట్టమొదటిసారి 1984 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి లోకసభలో అడుగుపెట్టింది.
ఒడిశాలో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల ఏకచత్రాధిపత్యానికి తెర పడింది. ఆ పార్టీని జనం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తిరస్కరించారు. ఎమ్మెల్యేలతో బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సమావేశం అయ్యారు. తమ పార్టీ అధికారం చేపట్టేనాటికి ఒడిశాలో పరిస్థితులు దారుణంగా ఉండేవని గుర్తుచేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ(BJP)కి కలిసిరాగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్(BRS) ఆశలు గల్లంతు చేశాయి. చేవెళ్ల, మల్కాజిగిరి(Chevella, Malkajigiri) పార్లమెంట్ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ను బీజేపీ తుక్కుతుక్కుగా ఓడించింది.
‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? అనేది మళ్లీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఆ ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయితే ఆయన తన రాజీనామా లేఖను మంగళవారం సాయంత్రమే సాధారణ పరిపాలన శాఖకు అందజేసినట్లు తెలుస్తుంది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి దేశ రాజధాని హస్తిన వేదికగా చక్రం తిప్పబోతున్నారా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్డీయే కూటమి 293 స్థానాలను గెలుచుకుంది. అలాగే ఇండియా భాగస్వామ్య పక్షాలు 233 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 17 స్థానాల్లో గెలిచారు. దీంతో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ముహూర్తం సైతం ఖరారు అయింది.