• Home » Lasya Nanditha

Lasya Nanditha

CM Revanth Reddy: లాస్య నందిత అకాలమరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది

CM Revanth Reddy: లాస్య నందిత అకాలమరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది

ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదన్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మిక మరణం పాలవడం అత్యంత విషాదకరమన్నారు.

MLA Lasya: లాస్యనందిత మృతిపట్ల కేసీఆర్‌తోపాటు పలువురు నేతల సంతాపం

MLA Lasya: లాస్యనందిత మృతిపట్ల కేసీఆర్‌తోపాటు పలువురు నేతల సంతాపం

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

Lasya Nanditha: కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

Lasya Nanditha: కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Lasyanandita: గడ్డు పరిస్థితులను అధిగమించి.. మొదటిసారి అసెంబ్లీలోకి...

Lasyanandita: గడ్డు పరిస్థితులను అధిగమించి.. మొదటిసారి అసెంబ్లీలోకి...

సాయన్న కుమార్తెగా లాస్యనందిత(Lasyanandita) గతంలో కంటోన్మెంట్‌ పాలకమండలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో నేర్చుకున్న

KCR: ధైర్యంగా వెళ్లు... గెలిచి వస్తావ్‌..

KCR: ధైర్యంగా వెళ్లు... గెలిచి వస్తావ్‌..

తండ్రి లేకుండా తొలిసారిగా ఎన్నికల్లో పోటీపడుతున్న జి.సాయన్న కుమార్తె లాస్య నందిత(Lasya Nandita)కు

Lasya Nanditha: ఎవరీ లాస్య నందిత.. కేసీఆర్ టికెట్ ఇచ్చిన ఈమె రాజకీయాలకు కొత్త కాదు కానీ..

Lasya Nanditha: ఎవరీ లాస్య నందిత.. కేసీఆర్ టికెట్ ఇచ్చిన ఈమె రాజకీయాలకు కొత్త కాదు కానీ..

బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జి.సాయన్న అకాల మరణంతో ఖాళీ అయిన కంటోన్మెంట్‌ టికెట్‌ హాట్‌ కేక్‌లా మారింది. అధికార పార్టీలో అరడజను మంది టికెట్‌ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. హైదరాబాద్‌ జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఇదే కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేతలు టికెట్‌ నాకంటే.. నాకు అని ప్రచారం చేసుకున్నారు. కానీ చివరకు ఎమ్మెల్యే టికెట్ సాయన్న కుమార్తె లాస్య నందితకే దక్కింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి